4Terraorists killed: జమ్ముకశ్మీర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ చంద్ర షా పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన కొనసాగుతుండగానే మరో వైపు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుంది.
మధ్యప్రదేశ్‌లో మావోయిస్టులు-భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు సహా ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. బాలాఘాట్ జిల్లాలోని లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ కాల్పులు జరిగాయి. ఈ ముగ్గురి మావోలపై రూ.30లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాఘాట్ జిల్లాలోని బహేలా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందని ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఈ…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగులో శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా. తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మరోవైపు, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా…
జిల్లాల విభజన.. నామకరణ నేపథ్యంలో కోనసీమ ప్రాంతానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అన్ని జిల్లాలకు గతంలోనే పేర్లు పెట్టిన ప్రభుత్వం.. కోనసీమ జిల్లాకు పేరెందుకు పెట్టలేదు..?అన్ని జిల్లాలతో పాటు అదే రోజున అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టి ఉంటే ఇవాళ ఈ గొడవే ఉండేది కాదు.జిల్లాలకు మహనీయు పేర్లు పెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామమే. జిల్లాలకు పేర్లు పెట్టడం అనేది కడపకు వైఎస్ పేరు పెట్టినప్పట్నుంచి…
కాకినాడలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనుమానస్పదంగా మృతి చెందడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఘటన జరిగి 48 గంటలు దాటిపోవస్తున్నా ఇంకా పోస్టుమార్టంకు కుటుంబ సభ్యులు ససేమిరా ఒప్పుకోవడం లేదు. సుబ్రహ్మణ్యం హత్య పట్ల కాకినాడ పట్టణంలో పలు పార్టీలకు చెందిన నాయకులు నిరసన తెలియజేస్తున్నారు. టీడీపీ నిజనిర్దారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నిజనిర్దారణ కమిటీ సభ్యులుగా మాజీ మంత్రి పితాని…
ఆంధ్రప్రదేశ్ లో మహిళల చిన్నారులపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతిపక్ష టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని వైసిపి ప్రభుత్వాన్ని టిడిపి శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో సామూహిక అత్యాచారానికి గురైన దళిత గర్భిణిని ఆదుకోవాలని వైసిపి ప్రభుత్వాన్ని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కోరారు. బాధితురాలికి తక్షణమే కోటి రూపాయల ఆర్థిక సాయం అందించాలని…
ఏపీలో జగన్ పాలనపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. రోజూ మామూలుగా మారిన అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలపై టీడీపీ మండిపడుతోంది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏపీ అథఃపాతాళానికి వెళ్ళిపోయిందన్నారు టీడీపీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ విషయంలో మాట్లాడిన అంశాలపై ఆయన మాట్లాడారు. ఏపీలో అధ్వాన్న పరిస్థితిపై మాట్లాడితే వైసీపీ దొంగల ముఠా విరుచుకుపడింది. పక్క రాష్ట్రాల సీఎంలు ఒక్కసారి ఏపీకి రండి. సొంత ఖర్చులు పెట్టి తీసుకొస్తాం. ఏపీని జగన్మోహన్ రెడ్డి…
ఆంధ్రప్రదేశ్ లో అడగడుగునా అత్యాచారాలు, వేధింపులు. అసలు శాంతిభద్రతలు వున్నాయా అనే అనుమానం కలుగుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీలో నేరాలపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. విజయవాడ, దుగ్గిరాల, రేపల్లె.. తాజాగా విజయనగరంలో మహిళలపై దారుణ అత్యాచారాలు అందరినీ కలిచివేస్తున్నాయి. మీలో చలనం రావాలంటే ఇంకెంత మంది ఆడబిడ్డలు బలవ్వాలి జగన్ గారు? అంటూ టీడీపీ నేత నారా లోకేష్ ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో అర్థరాత్రి ఘోరం జరిగినా సీఎం జగన్ మనస్సు కరగదా? అన్నారు. మహిళా…
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే భక్షక భటులై అర్ధ రాత్రి రోడ్డు పై వెళ్తున్న భార్యాభర్తల పట్ల అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించిన తీరు పలు విమర్శలకు తావిస్తోంది.. తాము భార్యాభర్తలమని చెప్పినా కనికరించలేదు. సంబంధం లేని ప్రశ్నలతో పవిత్ర బందాన్ని అభాసు పాలు చేశారు. ఈ సంఘటన నేలకొండపల్లిలో చోటుచేసుకుంది.రాజకీయ బలంతో పాటు అంగబలం, అర్థబలం ఉన్న వారి అడుగులకు మడుగులొత్తే పోలీసులు సామాన్య ప్రజానీకంపై మాత్రం వారి జులుం ప్రదర్శించడం విడ్డూరం. ఖమ్మం జిల్లా…