వరి విత్తన విక్రయాలపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ .. వరి విత్తనాలు అమ్మితే షాపు సీజ్ చేసి లైసెన్స్ ర ద్దు చేస్తానని, నేను ఉన్నంత వరకు మళ్లీ షాప్ తెరిచే అవకాశం కూడా ఉండదంటూ సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసి వ్యా ఖ్యలను రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టిందన్నారు. వరి విత్తనాలు అమ్మే విషయంలో హైకోర్టు , సుప్రీంకోర్టు చెప్పినా తాను వినను అని కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణగా భావిస్తున్నామని దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదించింది.
రైతులను భయపెట్టేలా, వరి విత్తనాల వ్యాపారులను బెదిరిస్తూ వెంకట్రామరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సిద్ధిపేటకు చెందిన రైతు బత్తుల నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం జస్టిస్ వినోద్ కుమార్ సారథ్యంలోని ఏక సభ్య బెంచ్ ఆయన పిటిషన్‌ను విచా రించింది. సిద్దిపేట కలెక్టర్ చేసిన వ్యాఖ్యలను తప్పు బడుతూ ఈ వాజ్యాన్ని స్వీకరించిన కోర్టు వరి విత్తనాలను లైసెన్స్ ఉన్న ఎవరైనా అమ్ము కోవచ్చని వ్యాపారులకు అభయమిచ్చింది. వరి విత్తనాల విక్రయాన్ని ఆపేందుకు ఎలాంటి నిబంధనలు లేవని కోర్టు స్పష్టం చేసింది.
అధికార పార్టీకి లాలూచీగా వ్యవహరించి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్న అధికారులు శిక్షకు అర్హులని సంజయ్ చెప్పారు. కోర్టు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ను తప్పుబట్టడంతో న్యాయం బతికే ఉందని మరోసారి నిరూపితమైందన్నారు. రైతు బత్తుల నారాయణ తరపున బీజేపీ లీగల్ సెల్ న్యాయమూర్తి చిన్నోళ్ల నరేశ్ రెడ్డి అద్భుతంగా వాదించారని సంజయ్ ఆయనను అభినందించారు. ఇకనైనా అధి కారులు నిబంధనలకు లోబడి వ్యవహరించాలని సంజయ్ సూచిం చారు. అధికార పార్టీకి కొమ్ము కాసేలా వ్యవహరించి ప్రజలకు నష్టం కలిగిస్తే భవిష్యత్‌లో వాళ్లను ఎవరూ కాపాడలేరన్న విషయాన్ని గుర్తించుకోవాలి బండి సంజయ్ హెచ్చరించారు.