తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం సృష్టించింది.. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న ఆడియో టేపులు, వీడియో ఫుటేజ్ వైరల్‌గా మారిపోయింది.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నోటీసుల్లో గందరగోళం ఏర్పడింది.
Bandi Sanjay Hot Comments: తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీలను సాక్ష్యులుగా చేర్చాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telugu Desam Party: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ రిమాండ్‌ను తిరస్కరిస్తూ విశాఖ చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును ఏపీ సీఐడీ హైకోర్టులో సవాల్ చేసింది. దీనితో పాటు గురువారం అయ్యన్న పాత్రుడు వేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరిపింది. ఈ సందర్భంగా సెక్షన్ 467 వర్తించదని ఎలా చెబుతారని విశాఖ కోర్టును హైకోర్టు ప్రశ్నించింది. అయ్యన్నపాత్రుడు, రాజేష్‌లకు నోటీసులు జారీచేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 10వ…
విద్యార్థి తన జీవితాన్ని అంతం చేసుకునేందుకు తీవ్ర చర్యలు తీసుకుంటే ఉపాధ్యాయులను మాత్రమే నిందించకూడదని, వారి భవిష్యత్తును రూపొందించడంలో తల్లిదండ్రులు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తారని మద్రాసు హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది.
విశాఖపట్నంతో పాటు అమరావతి కూడా బాగుండాలి అనేది తమ కోరిక అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతుల రిట్ పిటిషన్ పై న్యాయస్ధానం ఇచ్చిన అర్డర్ అనుసరించాల్సి ఉందన్నారు.. 17 మంది ప్రజా ప్రతినిధులు, అధికారులను పిటిషన్ లో పొందుపరిచారు.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తెలపడానికి సీనియర్ కౌన్సిల్ తో వచ్చామని.. రేపు మధ్యాహ్నం న్యాయస్ధానం వాదనలు వింటామన్నదని తెలిపారు.. ప్రజల ఆకాంక్షలను, ప్రజా ప్రతినిధులుగా మేం చెప్పకుండా ఎలా ఉంటాం?…
రాజాసింగ్ పై పీడీ యాక్ట్ విషయంలో ఈ నెల 20వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.. మరోసారి కౌంటర్ దాఖలుకు గడువు పొడిగించేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు..