సీఎస్ సోమేశ్ కుమార్ నియామకం అక్రమం అని మేం మొదటి నుండి చెబుతున్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తాజాగా హైకోర్టు అదే చెప్పిందని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ధరణి, సీసీఎల్ఎ, రెరాకు హెడ్ గా సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలని ట్వీట్టర్ ద్వారా ఆయన డిమాండ్ చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్ విషయంలో హైకోర్టు తీర్పును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వాగతించారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులు హైకోర్టు మెట్లెక్కారు. హైకోర్టు లో కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డ్ రామేశ్వర్ పల్లి రైతులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తమను సంప్రదించకుండా భూములను రీక్రియేషనల్ జోన్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ అన్నదాతలు హైకోర్టును ఆశ్రయించారు.
CBI: సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరుపుతుండగా.. దానిని సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టు సింగిల్ బెంజ్ ఆదేశాలు జారీ చేసింది.. అయితే, ఈ పరిణామాన్ని హైకోర్టు ధర్మాసనం ముందు సవాల్ చేశారు.. దీనిపై ఇవాళ వాదనలు హాట్‌హాట్‌గా సాగాయి.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.. మరోవైపు.. ఈ కేసు విచారణ కోసం సీబీఐ ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఎమ్మెల్యేలకు ఎర…
తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని హైకోర్టుకు తెలిపింది సీబీఐ.. ఈ వ్యవహారంలో ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. తమకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది.. డాక్యుమెంట్లు ఇస్తే.. విచారణ ప్రారంభిస్తామని హైకోర్టుకు తెలిపింది సీబీఐ.. దీంతో.. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని సీబీఐకి సూచించింది ధర్మాసనం.. ఇదే…
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ రిట్ పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ప్రభుత్వం తరపు వాదనలు పూర్తి కాగా. ప్రతివాదుల తరపు వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి విచారణ చేపట్టనుంది.