న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలిజీయం వ్యవస్థపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రక్రియపై ఆందోళనలు ఉన్నందున ఈ విషయంపై చర్చ జరగాల్సి ఉందన్నారు.
Kothapalli Geetha: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టు ఊరట లభించింది. బ్యాంకును మోసం చేశారన్న కేసులో కొత్తపల్లి గీతతో పాటు ఆమె భర్తకు రెండు రోజుల కిందట నాంపల్లి సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించగా.. సీబీఐ కోర్టు తీర్పును కొత్తపల్లి గీత దంపతులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన హైకోర్టు సీబీఐ కోర్టు తీర్పు అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా కొత్తపల్లి గీత, ఆమె…
న్యాయమూర్తుల పదవీ విరమణ వయసుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. గత వారం జరిగిన సంయుక్త సమావేశంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును తక్షణమే సవరించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ను సవాల్ చేస్తూ.. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన భార్య ఉషాబాయి, కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. పీడీ యాక్ట్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాజాసింగ్ భార్య.. హైదరాబాద్ పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ ఎత్తివేసి బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.. ఇక, ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. మంగళ్‌హాట్ ఎస్‌హెచ్‌వోకు నోటీసులు జారీ చేసింది.. రాజా సింగ్ పై పీడీ…
నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నుంచి ఊరట లభించింది. సీబీఐ కోర్టులో రోజువారీ విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్‌ను పొడిగించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. అనంతబాబు తల్లి అనారోగ్య కారణాలతో ఆదివారం మృతి చెందగా.. ఈ నేపథ్యంలో తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేలా తనకు బెయిల్ మంజూరు చేయాలన్న అనంతబాబు విజ్ఞప్తితో.. 3 రోజుల పాటు బెయిల్ మంజూరు చేస్తూ రాజమహేంద్రవరం కోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.. ఇక, ఈ నెల 25…
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. అనంతబాబు తల్లి అనారోగ్య కారణాలతో ఆదివారం మృతి చెందగా.. ఈ నేపథ్యంలో తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేలా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో.. అనంతబాబుకు 3 రోజుల పాటు బెయిల్ మంజూరు చేస్తూ రాజమహేంద్రవరం కోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.. ఇక, ఈ నెల 25 మధ్యాహ్నం తిరిగి…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మాయదార్లపల్లి గ్రామం విద్యార్థుల లేఖ రాశారు.. మారుమూల ప్రాంతమై ఎక్కడో విసరి వేయబడ్డట్లు ఉన్న కర్ణాటక బార్డర్ లోని చిట్ట చివరి గ్రామాలైన మాయదార్లపల్లి.. ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదు.. కనీసం మండల కేంద్రానికి చేరుకోవాలంటే సరైన బస్సు సౌకర్యం కూడా లేని పరిస్థితి… ఇక, ఆ గ్రామ విద్యార్థులకు కొత్త కష్టాలు వచ్చాయి.. గత 45 రోజులుగా మాయదార్లపల్లి ఆ గ్రామ విద్యార్థులను బసాపురం…
బార్ల మద్యం పాలసీ వ్యవహారం హైకోర్టుకు చేరింది.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది… అయితే, పిటిషనర్ల తరపున వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. సంబంధిత జీవోపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.. ఇక, రేపటి నుంచి వేలం ప్రారంభమవుతుందని, నాన్ రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉందని పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. డిపాజిట్ తిరిగి ఇవ్వబోమని ప్రభుత్వం చెబుతోందని, దీనివల్ల నష్టపోతారని ధర్మాసనానికి వివరించారు. వాదనలు విన్న…