విశాఖపట్నంతో పాటు అమరావతి కూడా బాగుండాలి అనేది తమ కోరిక అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతుల రిట్ పిటిషన్ పై న్యాయస్ధానం ఇచ్చిన అర్డర్ అనుసరించాల్సి ఉందన్నారు.. 17 మంది ప్రజా ప్రతినిధులు, అధికారులను పిటిషన్ లో పొందుపరిచారు.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తెలపడానికి సీనియర్ కౌన్సిల్ తో వచ్చామని.. రేపు మధ్యాహ్నం న్యాయస్ధానం వాదనలు వింటామన్నదని తెలిపారు.. ప్రజల ఆకాంక్షలను, ప్రజా ప్రతినిధులుగా మేం చెప్పకుండా ఎలా ఉంటాం? అని ప్రశ్నించిన ఆయన.. ప్రజల ఆలోచనా విధానం మేం చెప్పడానికి వచ్చాం.. మేం కూడా అవసరం అయితే ఇంప్లీడ్ అవుతామని మా ప్రాంత నాయకులు వచ్చారని తెలిపారు..
Read Also: Fake Currency Notes From ATM: ఏటీఎం నుంచి చిల్డ్రన్ బ్యాంక్ నోట్లు.. కంగుతిన్న కస్టమర్..
ఇక, పాదయాత్ర విరామ సమయంలో 25 మంది దగ్గర కూడా ఐడీ కార్డులు లేవని ఆరోపించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. కోర్టు ఇచ్చిన ఆదేశాలను బైపాస్ చేస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించిన ఆయన.. ప్రజలకు మేం సమాధానం చెప్పాలి.. ప్రజా ప్రతినిధులుగా మా చేతనైన కంట్రోల్ మేం చేస్తున్నాం.. విశాఖతో పాటు అమరావతి కూడా బాగుండాలని మేం కోరుకుంటున్నాం అని స్పష్టం చేశారు.. రెచ్చగొట్టేలా ఏ పని చేయద్దని మేం అంటున్నాం.. కానీ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. ఇదే సమయంలో.. వికేంద్రీకరణకు మద్దతు తెలిపి.. అమరావతి బాగుండాలి అంటే కాలు కింద పెట్టనీయకుండా పాదయాత్ర చేస్తున్నవారిని అరసవిల్లి వరకు తీసుకెళ్తామని ప్రకటించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. కాగా, అమరావతి మహా పాదయాత్ర రద్దు చేయాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.. పాదయాత్ర రద్దు పిటిషన్ తో పాటు దాఖలైన అన్ని పిటిషన్లపై రేపు మధ్యాహ్నం వాదనలు వింటామని తెలిపింది హైకోర్టు.. సంఘీభావం తెలపడానికి వచ్చే వారికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను సవరించాలంటూ కోర్టును కోరారు పిటిషనర్ తరపు న్యాయవాదులు.. అయితే, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని మరోసారి ధర్మాసనం స్పష్టం చేసింది.. పాదయాత్రలో అనుమతించిన 600 మాత్రమే పాల్గొనాలని తేల్చిచెప్పింది హైకోర్టు.