ఏపీపీఎస్సీకి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఏపీపీఎస్సీ చేపట్టిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ నోటిఫికేషన్ ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది హైకోర్టు. నోటిఫికేషన్ ని హైకోర్టులో సవాల్ చేశారు ఈస్ట్ గోదావరికి చెందిన కాశీ ప్రసన్నకుమార్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్లకు వ్యతిరేకంగా ప్రశ్నాపత్రం కేవలం ఇంగ్లీషులో మాత్రమే ఉంటుందని ఇవ్వడాన్ని తప్పు పట్టారు పిటిషనర్. ప్రశ్నాపత్రం ఇంగ్లీషులో మాత్రమే ఇవ్వడం రాజ్యాంగ సూత్రాలకి, న్యాయ సూత్రాలకు వ్యతిరేకమంటూ వాదనలు వినిపించారు పిటిషనర్ తరపు న్యాయవాది.
Read Also: Rajinikanth: రజినీకాంత్ జపం చేస్తున్న సోషల్ మీడియా
ప్రశ్నాపత్రాలు అభ్యర్థులకి అవసరమైన అధికార భాషలోనే ఉండాలి అంటూ గతంలో సుప్రీంకోర్టు నిబంధనలు పక్కనపెట్టి కేవలం ఇంగ్లీషులో మాత్రమే ప్రశ్నాపత్రం ఉండటం సరికాదన్నారు న్యాయవాది. పిటిషనర్ వాదనను పరిగణలోకి తీసుకొని నోటిఫికేషన్ తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. కేసు విచారణ మూడు వారాలకు వాయిదా వేస్తూ ప్రతివాదులను కౌంటర్ చేయవలసిందిగా ఆదేశాలు జారీచేసింది హైకోర్ట్.
Read ALso: Cleaned With Cow Urine: ఎందుకీ వివక్ష?.. దళిత మహిళ నీళ్లు తాగిందని గోమూత్రంతో క్లీనింగ్