స్టార్ హీరోయిన్ సాయిపల్లవికి హైకోర్టు షాక్ ఇచ్చింది. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో నోటీసులు రద్దు చేయాలని ఆమె వేసిన పిటిషను హైకోర్టు తిరస్కరించింది.
ఏపీలో అన్ని థియేటర్లలో ఆన్‌లైన్ సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారంపై శుక్రవారం నాడు హైకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయంపై హైకోర్టు స్టే విధించింధి. జీవో నెంబర్ 69ని నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఆన్‌లైన్ టిక్కెట్ల వ్యవహారంపై ప్రభుత్వం జీవో నంబర్ 69 జారీ చేయగా.. దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్…
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నేడు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్ వేదికగా జరిగన ఈ కార్యక్రమంలో నేడు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ఉజ్జల్ భూయాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. తెలంగాణ హైకోర్టు 2019 జనవరి 1న ఏర్పాటు…
టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటి కూల్చివేత పై హైకోర్టు స్టే విధించింది. అయ్యన్న ఇంటి కూల్చివేత పై ఆదివారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఆయన తరపు న్యాయవాదులు. అర్థరాత్రి వాదనలు ముగిశాయి.జలవనరుల శాఖ గతంలో అనుమతి ఇచ్చినప్పటికీ ఎటువంటి నోటీసు లేకుండా ఇల్లు కూల్చివేస్తున్నారని వాదనలు వినిపించారు. దీంతో వాదనలు విన్న అనంతరం హైకోర్ట్ అయ్యన్న ఇంటి దగ్గర కూల్చివేతపై స్టే…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను తెలంగాణలోనే కొనసాగించాలని, ఇందుకు ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పుడు ఈ వ్యవహారంలో కేంద్రం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర సర్వీస్ అధికారుల కేటాయింపుల్లో భాగంగా కేంద్రం సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయించింది. పలువురు కేంద్ర సర్వీస్ అధికారులను ఏపీకి కేటాయించడాన్ని తప్పుపడుతూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ లో వారంతా…
తెలంగాణ హైకోర్టు కొత్త ఛీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్ నియామకం అయ్యారు. తెలంగాణ హైకోర్టు నూతన ఛీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్ నియామిస్తూ.. సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. ఇవాళ్టి వరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పనిచేశారు. అయితే… తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ హైకోర్టు కొత్త ఛీఫ్…
ప్రపంచం మొత్తం టెక్నాలజీలో దూసుకుపోతోంది.. ఏ కొత్త టెక్నాలజీ వచ్చిన భారత్‌లోనూ విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఓ అత్యవసర కేసు విచారణలో ఇప్పుడే అదే కీలకంగా పనిచేసింది.. దేశ హైకోర్టు చరిత్రలోనే తొలిసారిగా ఓ న్యాయమూర్తి వాట్సాప్ ద్వారా కేసును విచారించి వార్తల్లో నిలిచారు.. వాట్సాప్ ద్వారా కావడంతో సెలవు రోజున కూడా కేసు విచారణ సులభంగా సాగిపోయింది.. కాగా, సోషల్ మీడియాలో వాట్సాప్ యాప్ ప్రస్తుతం ప్రముఖ పాత్ర పోషిస్తోంది.. స్మార్ట్ ఫోన్ ఉంటే.. అందులో వాట్సాప్…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులకు బెయిలుపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.. సీబీఐ, నిందితుల తరపున వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.. అయితే, సీబీఐ విచారణ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది.. వివేకా హత్య కేసు వెనుక కుట్ర ఉందని తెలిపిన సీబీఐ.. జైలులో ఉండే నిందితులు సాక్ష్యులను బెదిరిస్తున్నారని వాదించింది.. Read Also: North…