ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషం విదితమే.. అయితే, చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై ఏపీ ప్రభుత్వ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.. బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్న పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు.. స్కిల్ స్కాంకు సంబంధించిన డబ్బు టీడీపీ పార్టీ ఖాతాలోకి చేరినట్టుగా కచ్చితమైన ఆధారం లేనట్టుగా బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది తొందరపాటుగా భావిస్తున్నాం అంటున్నాయి.
High Court: భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో ఉంటున్న వ్యక్తికి సంబంధించిన కేసులో పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘కామపూరిత, వ్యభిచార జీవితం’’ గడుపుతూ, భార్యకు విడాకులు ఇవ్వని వేరే మహిళతో ఉంటున్న వ్యక్తి సంబంధాన్ని ‘లివ్ ఇన్ రిలేషన్‌షిప్’’ అని పిలువలేమని కోర్టు అభిప్రాయపడింది. తమ ప్రాణాలకు, స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఓ జంట దాఖలు చేసిన పిటిషన్‌ని జస్టిస్ కుల్దీప్ తివారీతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ కొట్టేసింది.
హెచ్‌సీఏలో కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్ చేసిన కేసులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ హైకోర్టుకు వెళ్లారు. టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని అజారుద్దీన్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్‌మాల్ చేశారనే ఆరోపణలు అజహరుద్దీన్‌పై ఉన్నాయి.
Delhi High Court: తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు చెరగనిదని, రాజ్యాంగపరంగా రక్షితమని, అలాంటి వివాహ బంధాలపై కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం చెప్పలేరని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహానంతరం తన కుటుంబాల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని ఓ జంట కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వారికి పోలీస్ రక్షణ కల్పిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ తుషార్ రావు గేదల తన ఉత్తర్వుల్లో.. పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత…
హైకోర్టు న్యాయమూర్తులుగా 13 మంది న్యాయవాదుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం వివిధ హైకోర్టులకు న్యాయమూర్తులుగా 13 మంది న్యాయవాదుల పేర్లను సిఫార్సు చేసింది.
దేశ వ్యతిరేక కార్యకలాపాల కేసులో 'న్యూస్‌క్లిక్' వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.