Chandrababu Bail: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషం విదితమే.. అయితే, చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై ఏపీ ప్రభుత్వ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.. బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్న పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు.. స్కిల్ స్కాంకు సంబంధించిన డబ్బు టీడీపీ పార్టీ ఖాతాలోకి చేరినట్టుగా కచ్చితమైన ఆధారం లేనట్టుగా బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది తొందరపాటుగా భావిస్తున్నాం అంటున్నాయి.
Read Also: Adilabad High Court: బాంకే బిహారీ మందిర్ కారిడార్ నిర్మాణం.. ఆమోదించిన హైకోర్టు
టీడీపీ నుంచి ఎవ్వరూ ఇప్పటి వరకూ దర్యాప్తునకు హాజరు కాలేదు.. సీడీఐ కోరిన సమాచారం కూడా ఇప్పటివరకూ ఇవ్వలేదు.. దర్యాప్తునకు సహకరించడంలేదని కోర్టుకు స్పష్టంగా తెలియజేశాం.. సీమెన్స్, డిజైన్ టెక్‌లు హై ఎండ్ టెక్నాలజీని బదిలీ చేయలేదు అనడానికి దృఢంగా చెప్పలేదని బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొనడం కూడా సరికాదు.. కుదుర్చుకున్న ఎంవోయూను వారు అమలు చేయలేదన్నది ఈకేసులో ప్రధాన అంశం.. రిమాండ్ రిపోర్టులో ప్రతి పేరాలో ఇదే అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి..
Read Also: Mulugu Seethakka: ఆమె ఫోటో ఈవీఎం పై కనిపించడం లేదు..! కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన..
ఇక, ఇతర కేసుల్లో మోడస్ ఆపరండీ ఏరకంగా నిర్వహించారో చెప్పేందుకు వాట్సాప్ ఛాట్స్‌ను అందులో పేర్కొన్నాం, ఇది ఇంకా విచారణలోనే ఉంది. కానీ, చంద్రబాబుకు సంబంధం లేదని ఎలా అప్పుడే చెప్పగలరు..? అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు.. ఫోరెన్సిక్ ఆడిట్ గురించి కూడా బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.. చంద్రబాబును ఏరకంగా బాధ్యుడ్ని చేస్తారంటూ బెయిల్ ఆర్డర్‌లో పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
Read Also: Vijayashanti: మెదక్ లో విజయశాంతి ప్రచారం.. రోడ్ షోలో పాల్గొననున్న రాములమ్మ
స్కిల్ స్కాంలో కుట్ర కోణం అత్యంత కీలకమైనది.. నేరం జరగడానికి దారితీసిన పర్యవసానాల్లో ఏ స్థాయిలో ఎవరు పాలుపంచుకున్నా చట్టాన్ని దాన్ని తీవ్రంగానే చూస్తుంది.. అలాంటి సందర్భంలో హైకోర్టు కోర్టు దీన్ని విడిగా చూడలేదు అంటున్నాయి. నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేసినంత మాత్రాన నిధుల మళ్లింపులో చంద్రబాబు ప్రమేయాన్ని సూచించదని బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.. నగదు బదిలీకి సంబంధించిన వ్యవహారాన్ని ఆధారాలతో సహా ఉంచినప్పుడు, ఈ విషయంలో ఇప్పటికే ఒక ముగింపుకు రాలేమని మరోవైపు కోర్టు పేర్కొంది.. ఈ రెండు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయంటూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు.