Supreme Court Collegium: హైకోర్టు న్యాయమూర్తులుగా 13 మంది న్యాయవాదుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం వివిధ హైకోర్టులకు న్యాయమూర్తులుగా 13 మంది న్యాయవాదుల పేర్లను సిఫార్సు చేసింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా ఉన్నారు. ఇందులో గౌహతి హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయవాదులు ఎన్.ఉన్ని కృష్ణన్ నాయర్, కౌశిక్ గోస్వామి పేర్లను సిఫార్సు చేశారు. గౌహతి హైకోర్టుకు ఈ 2 పేర్లను సిఫార్సు చేశారు. సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన తీర్మానంలో.. మే 29, 2023న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తన ఇద్దరు సీనియర్-సహోద్యోగులతో సంప్రదించి, పైన పేర్కొన్న న్యాయవాదులను ఆ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేశారు.
Also Read: NewsClick Case : హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన ప్రబీర్ పుర్కాయస్థ
హైకోర్టుకు పదోన్నతి పొందేందుకుఅభ్యర్థుల అర్హత, అనుకూలతను అంచనా వేయడానికి న్యాయ శాఖ చేసిన పరిశీలనలతో పాటు నిర్దిష్ట అభ్యర్థులపై వచ్చిన ఫిర్యాదులతో సహా రికార్డులో ఉంచిన అంశాలను పరిశీలించి, మూల్యాంకనం చేశామని కొలీజియం పేర్కొంది. ఫైల్‌లో న్యాయ శాఖ చేసిన వ్యాఖ్యలతో పాటు కొంతమంది అభ్యర్థులపై వచ్చిన ఫిర్యాదులను కూడా అధ్యయనం చేశామని తెలిపింది. మరో నిర్ణయంలో, ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం న్యాయవాదులు సిద్ధార్థ్ సా, అలోక్ మహారా పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది.
న్యాయవాదులు హర్మీత్ సింగ్ గ్రేవాల్, దీపిందర్ సింగ్ నల్వా, సుమీత్ గోయల్, సుదీప్తి శర్మ, కీర్తి సింగ్ పేర్లను కూడా పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సిఫారసు చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం న్యాయవాదులు వినయ్ సరాఫ్, వివేక్ జైన్, ఆశిష్ శ్రోతి, అమిత్ సేథ్ పేర్లను కూడా కొలీజియం సిఫార్సు చేసింది.