ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత సంజయ్ సింగ్‌లకు గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోడీ విద్యార్హతపై ప్రశ్నలు లేవనెత్తిన అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లకు కోర్టు నుంచి ఊరట లభించలేదు.
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మునిసిపల్ కార్యాలయం వద్ద 16 మంది కార్పొరేటర్ల ఆందోళన చేపట్టారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బుర్రా మహేందర్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానంపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమళ్ల వినోద్ కుమార్ స్టే విధించారు. ఫిబ్రవరి 16న అవిశ్వాస సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు రంగారెడ్డి కలెక్టర్ అనుమతిని సవాల్ చేస్తూ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి విచారణ జరిపారు. 30 రోజుల్లో జరగాల్సిన అవిశ్వాస తీర్మానం…
ఢిల్లీ హైకోర్టుకు బాంబుల బెదింపులు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులను ఈ- మెయిల్ ద్వారా పంపారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు న్యాయస్థానం దగ్గర కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు.
Farmers Protest: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)తో పాటు రైతుల సమస్యల పరిష్కారానికి పలు డిమాండ్లు చేస్తూ రైతులు "ఢిల్లీ ఛలో" మార్చ్‌కి పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులను అడ్డుకునేందుకు బారికేడ్లు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు కేంద్ర బలగాలు రైతుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో పంజాబ్-హర్యానా హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు విచారించింది.
కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు ఆ రాష్ట్ర హైకోర్టు (Karnataka High Court) ఝలక్ ఇచ్చింది. ఓ కేసులో ఆయనకు రూ.10 వేలు జరిమానా విధించింది.
తన రాజీనామా ఆమోదంపై గంటా శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. మూడేళ్ల కింద చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడంపై గంటా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజీనామా ఆమోదంలో ప్రొసీజర్ ఫాలో కాలేదంటూ గంటా పిటిషన్ వేశారు. అంతేకాకుండా.. స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఈ క్రమంలో గంటా శ్రీనివాస్ పిటిషన్ ఈనెల 29న విచారణకు రానుంది.
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై నేడు మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు ను తప్పుదోవ పట్టించారా లేదా.. అని చెన్నమనేని ప్రశ్నించిన హైకోర్టు… కోర్టు ను తప్పుదోవ పట్టించునే వాళ్లకు ఉపషమనం ఎందుకు కల్పించాలని వ్యాఖ్యానించింది. 2018 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో జర్మనీ పౌరసత్వం తో పోటీ చేసారన్న హైకోర్టు.. జర్మనీ పౌరసత్వం తోనే ఇంకా ప్రయాణాలు చేస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించారు. 2018 ఎన్నికల సందర్భంగా జర్మనీ…