తెలంగాణను వర్షాలు వీడనంటున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. అంతేకాకుండా.. భారీ వర్షాలతో జలాశయాలకు జలకళ సంతరించుకుంది. అయితే తాజాగా వాతావరణ శాఖ ఈ నెల 9వ రకు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు ఈ నెల 8న 9న కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అంతేకాకుండా.. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫా బాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
అయితే ఈ నేపథ్యంలోనే నేడు మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురియడంతో ఏడుపాయల ఆలయం దగ్గర మంజీరా నది పరవళ్లు తొక్కింది. భారీ వరదలతో ఆలయం ముందు పెరిగిన వరద ప్రవాహం పోటెత్తింది. అంతేకాకుండా.. ఆలయంలోకి వరద నీరు వచ్చిచేరుతుండటంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసేసిశారు అధికారులు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి అర్చకులు పూజలు చేస్తున్నారు.