తెలంగాణను ఇప్పటికే భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి.. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడినా.. మరికొన్ని జిల్లాల్లో భారీ నష్టాన్ని మిగిల్చాయి.. అయితే, మరో మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయిన వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.. నిన్నటి ఆవర్తనం ఇవాళ కూడా ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని.. పైకి వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉందని పేర్కొన్న వాతావరణశాఖ.. దీని ప్రభావంతో ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఇక, రేపు, ఎల్లుండి అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది..
Read Also: Booster Dose: శుభవార్త.. ఇంటి వద్దే బూస్టర్ డోస్..!
ఇవాళ, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, రేపు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.. మరోవైపు, ఎల్లుండి.. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలకు అకవాశం ఉందని పేర్కొంది వాతావరణశాఖ.. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.