ఎడతెరిపి లేని వాన ఆదిలాబాద్ జిల్లా వాసుల్ని కుదిపేస్తోంది. వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా లోతట్టు కాలనీలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల కొమరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. కొమురంభీం జిల్లాలో పిడుగుపాటుకు వందకు పైగా గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. మంచిర్యాల జిల్లా..చెన్నూర్ పట్టణ సమీపంలో ని 63వ జాతీయ రహదారిపై గల బతుకమ్మ వాగు బ్రిడ్జి వద్ద రోడ్డు కుంగింది.
Read Also: Nandamuri Balakrishna: మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసింది
అక్కడ ఓ భారీ గుంత ఏర్పడింది. దీంతో చెన్నూర్ కొటపల్లి మద్య రాకపోకలు నిలిపివేసారు అధికారులు…నిర్మల్ జిల్లా లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రాజెక్టు లోకి భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతుంది. స్వర్ణ, కడెం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో కొనసాగుతుంది.. కడెం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. బాసర మండల కేంద్రంలో రాత్రి నుండి కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. ముంపు భయంతో ఆయా కాలనీ వాసులు బిక్కు బిక్కుమంటున్నారు.
రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పాటగూడలో విషాదం నెలకొంది. పాముకాటుతో ఆత్రం భీంరావ్ (13), ఆత్రం ధీపా (5) అనే అన్న చెల్లి ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. ఇంట్లో అర్థరాత్రి 2 గంటలకు భారీ వర్షం కురవడంతో కరెంటు పోయింది. పక్కనున్న అడవుల నుంచి విష సర్పం ఇంట్లో దూరి నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులను కాటేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఇద్దరు చిన్నారుల మృతదేహాలను ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పొలీసులు. ఒకే కుటుంబానికి చెందిన వారు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Read Also: KrishnamRaju: కృష్ణంరాజు మృతికి మెగాబ్రదర్స్ తీవ్ర సంతాపం