రాజస్థాన్, పంజాబ్,హర్యానా మరియు కచ్ ప్రాంతాల నుంచి నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణకు తదుపరి 2 రోజుల్లో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. వాయువ్య మరియు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈరోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదులుతూ తదుపరి 24 గంటలలో మరింతగా బలపడే అవకాశం ఉంది.
Read Also: Kurnool constituency : ఆ ఇద్దరి మధ్య మళ్ళీ గ్యాప్ పెరిగినట్టేనా..?
ఋతుపవన ద్రోణి ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి ,భటిండా, ఢిల్లీ, హర్దోయి, వారణాసి, రాంచీ, బాలాసోర్ మరియు అక్కడ నుండి తూర్పు వైపు వాయువ్య మరియు ప్రక్కనే ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రాంతం గుండా వెళుతుంది.రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది వాతావరణ శాఖ.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు ౩౦ నుండి 40కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.ఈదురు గాలులు గంటకు ౩౦ నుండి 40కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .
ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.ఈదురు గాలులు గంటకు ౩౦ నుండి 40కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
Read Also: Assault on lift giver: లిప్ట్ ఇచ్చిన వ్యక్తిపై ఇంజెక్షన్ తో దాడి.. ఆపై బైక్ తో..
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇవాళ తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. భారీవర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు ౩౦ నుండి 40కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. రేపు మరియు ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.ఈదురు గాలులు గంటకు ౩౦ నుండి 40కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది . ఈ రోజు , రేపు మరియు ఎల్లుండి రాయలసీమలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.