భారత దేశంలో ఎటు చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. పలు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు జనాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. కర్ణాటక లో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రమంతా వరదలతో నిండిపోయింది.. ఎటు చూసిన నీళ్లు ఉండటంతో జనాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.. చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కాలేజీలు మూతపడ్డాయి..మరో ఐదు రోజుల పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా దక్షిణ కన్నడ ప్రాంతంలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్టు అధికారులు పేర్కొన్నారు..
వివరాల్లోకి వెళితే..కర్నాటకలోని దక్షిణ కన్నడ ప్రాంతంలో వానలు దంచికొడుతున్నాయి. కుండపోత వర్షం నేపథ్యంలో ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించారు. ఈ క్రమంలోనే దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ జూలై 4 న మంగళూరు, బంట్వాల్, ముల్కి, మూడ్బిద్రి, ఉల్లాల్ లోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక-ఉన్నత పాఠశాల, ప్రీ-యూనివర్శిటీ, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు సెలవు ప్రకటించారు.. అదే విధంగా మరో రెండు రోజుల పాటు ఆరెంజ్ అలెర్ట్ ను ప్రకటించారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు..
ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్లను పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానివద్దని అధికారులు సూచించారు.. అలాగే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. జిల్లా, తాలూకా స్థాయి అధికారులు సిద్ధంగా ఉండాలనీ, విపత్తు నిర్వహణ చర్యలను నిర్విఘ్నంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఏరియాకు కేర్ సెంటర్ ను సిద్ధంగా ఉంచాలని డిపార్ట్ మెంటల్ అధికారులను ఆదేశించినట్లు డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కోస్తా ప్రాంతాలను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బళ్లారి, చామరాజ్ నగర్, చిక్కబళ్లాపుర, చిత్రదుర్గ, దక్షిణ కన్నడ, దావణగిరి, కోలార్, కొప్పల్ రాయచూర్, ఉత్తర కన్నడ జిల్లాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపింది.. అలాగే ఆంధ్రప్రదేశ్ కు కూడా భారీ వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది..