Rain Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. అలాగే గ్రేటర్ వరంగల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో అర్థరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఈరోజు కూడా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Read also: Hookah Centre: కేఫ్ ముసుగులో హుక్కా సెంటర్.. కాప్స్ అదుపులో ముగ్గురు
రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, జనగాం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. రేపు వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, పెద్దపల్లి, నిజామాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. అలాగే 7వ తేదీన పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read also: Pedda Amberpet: మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారయత్నం.. కాపాడిన హిజ్రా
7న మెదక్, కామారెడ్డి, జనగాం, వరంగల్, ములుగు, హబూబాబాద్, హనుమకొండ, జయంసర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. మరికొన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు పంటలు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. నిన్న జనగం జిల్లా నర్మెట్టలో 36.8, కొడకండ్ల ప్రాంతంలో 25, ఖమ్మం జిల్లా వైరాలో 36, నారాయణపేటలో 19.2, ఊట్కూరులో 18 మి.మీ వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. దీని ప్రభావంతో ఈ నెలలో భారీ వర్షాలు కురుస్తాయి.
Alcohol: రోజూ మందు తాగుతున్నారా..? అయితే మీ లివర్ రిస్క్‌లో ఉన్నట్లే..