High Waves: అల్లోకల్లోలంగా ఆరేబియా సముద్ర తీరం.. ముంబైలో భారీ వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Waves: నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ముంబయిలో అయితే వర్షాలు ఆగకుండా కురుస్తూనే ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గత వారం రోజులుగా ఎడతెగకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత ఆదివారం నుంచి విరామం లేకుండా ముంబై నగరాన్ని వర్షాలు ముంచెత్తుతూనే ఉన్నాయి. దాంతో లోతలోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి.
Read also: Health Tips: జీలకర్రను ఇలా తీసుకుంటే చాలు.. త్వరగా బరువు తగ్గుతారు..
Also Read
గత ఆదివారం నుంచి విరామం లేకుండా వర్షాలు పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. నగరంలోని అంధేరీ సహా పలు ఏరియాల్లోని అండర్‌పాస్‌లు, సబ్‌వేలలో వరద నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈరోజు ఉదయం కూడా అంధేరీలో భారీ వర్షం పడటంతో సబ్‌వేలో భారీగా వరదనీరు నిలిచింది. దాంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో అధికారులు నీటిని తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈసారి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైనప్పటికీ ముంబైలో జూన్ నెలలో కురువాల్సిన వర్షాల్లో 97 శాతం కురిశాయని అధికారులు తెలిపారు. మరోవైపు ముంబైలోని ఆరేబియా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న మెరైన్ డ్రైవ్ (నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్డు) వైపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలని.. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని భారత వాతారణ శాఖ అధికారులు ప్రకటించారు.
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!