Nagaland: నాగాలాండ్‌లో పిడుగులా పడింది ఓ బండరాయి. దిమాపూర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. చుముకేడిమాలో పెద్ద బండరాయి దొర్లుకుంటూ రెండు కార్లను కొట్టింది. ఇదంతా లిప్తపాటులో జరిగిపోయింది. దీంతో కార్లలో ఉన్నవారు తప్పించుకోలేకపోయారు. అంతలోనే మరో బండ రాయి వచ్చి ఇంకో కారును కొట్టింది. బండరాళ్లు పడడంతో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Read Also: Galla Siddharth: మహేష్ కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ?
నాగాలాండ్‌లోని చుముకేడిమా కొండప్రాంతం. వర్షాలు పడితే ఈ రోడ్డులో చాలా జాగ్రత్తగా వెళతారు వాహనదారులు. ఇవాళ కూడా అంతే. నింపాదిగానే వెళుతున్నారు. పెద్ద బండరాయి దొర్లుకుంటూ రావడానికి ముందు కార్లన్నీ ఆగే ఉన్నాయి. ముందు వాహనాలు కదిలితేనే వెనుక వాహనాలు కదిలే పరిస్థితి. రెండు వరుసల్లో వాహనాలు ఆగి ఉన్నాయి. రైట్ సైడ్ కొండ. లెఫ్ట్ సైడ్ లోయ. ఎటూ ముందుకు కదలడానికి లేదు. డ్రైవింగ్ చేస్తున్న వాళ్లు, ప్రయాణికులు అంతా చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో బండరాళ్లు పడతాయన్న భయాందోళనల్లో ఉన్నారు. ఇంతలో ఓ రాయి వచ్చి పిడుగులా రోడ్డు వారకు పడింది. కప్ప గంతులేసినట్లు ఆ బండ రాయి ఎగిరి ఓ కారుపై గట్టిగా పడింది. ఆ తర్వాత బంతిలా ఎగిరి మరో కారుపై పడింది. అదే సమయంలో కొంచెం దూరంలో మరో బండ రాయి వచ్చి మరో కారును ఢీకొట్టింది. దెబ్బకు హై ఎండ్ కార్లు సైతం అప్పడల్లా నలిగిపోయాయి. బండ రాయి విరిగిపడిన ఘటనలో మూడు కార్లు ధ్వంసం కావడంతో.. చుముకేడిమాలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ప్రయాణికులు అంతా కలసి ధ్వంసమైన కార్లను పక్కకు తొలగించారు. ఆ తర్వాత రూట్ క్లియర్ చేయడంతో నింపాదిగా ముందుకు కదిలాయి వాహనాలు.