Telangana Rains: గత 24 గంటల్లో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వర్షాల కారణంగా మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. సిరిసిల్లలో నీటి ప్రవాహంలో చిక్కుకుపోయిన గర్భిణి, 19 మంది కూలీలను పెద్దపల్లి జిల్లాలో రెస్క్యూ టీం రక్షించింది.
గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర చర్యలపై మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తం చేస్తున్నారు. రెండు రోజులుగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వరద నుంచి ప్రజలను కాపాడుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా చూడాలని మంత్రులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.
వరంగల్ జిల్లాలో భారీ వర్షాలతో హంటర్ రోడ్ నీట మునిగింది. దీంతో నయూంనగర్, శివనగర్ లకు చెందిన వరద బాధితులు బిల్డింగ్‌లపై తలదాచుకుంటున్నారు. హంటర్ రోడ్డుకు ఎస్డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. తమకు సాయం చేయాలని బాధితుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. దీంతో పూర్తిగా వరంగల్-హన్మకొండ కనెక్టివిటీ తెగిపోయింది
Moranchapally: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి రెండు ఆర్మీ హెలికాప్టర్లను పంపింది. మోరంచవాగు నీటిలో మునిగిన మోరంచపల్లి గ్రామం.
Talangana Rains: హైదరాబాద్ లో రాగల మూడు గంటలు చిరు జల్లులే పడే అవకాశం ఉందని, భారీ వర్షం పడే అవకాశాలు లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. సాయంత్రం వరకు నగరానికి భారీ వర్షం లేదని వాతావరణ నిపుణులు తెలపడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
CM KCR: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
Bhupalpally: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ గ్రామం జలమయమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామస్తులు వరదలో చిక్కుకున్నారు. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు ఉగ్రరూపం దాల్చింది.
Kadem project: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్‌లో ఉంది. వరద ఉధృతి పెరగడంతో ఇన్ ఫ్లో పెరిగింది. సామర్థ్యానికి మించి నీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
దేశ వ్యాప్తంగా గత కొన్నిరోజులుగా వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.