Heavy Rains: కామారెడ్డిలో భారీ వర్షాలు..బయటకు రావొద్దంటు దండోరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. భారీగా కురుస్తున్న వర్షాలకు జనాలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.. కామారెడ్డిలో పరిస్థితి దారుణంగా ఉంది.. గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. భారీ వర్షాల కారణంగా భీమేశ్వర వాగు, పాల్వంచ వాగు, నల్లమడుగు మత్తడి వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వర్షం ధాటికి జిల్లా కేంద్రంలోని శ్రీరాంమ్ నగర్ కాలనీ, రుక్మిణికుంట, పంచాముఖి హనుమాన్ కాలనీ, అయ్యప్ప నగర్ కాలనీ పూర్తిగా జలమయం అయ్యాయి.
రోడ్లపైకి వచ్చి చేరిన వరద నీటితో వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. పలు గ్రామాలలో దండోరా వేయించి ఇళ్లలోంచి బయటకు రావద్దని గ్రామపంచాయతీ ప్రజా ప్రతినిధులు, అధికారులు హెచ్చరిస్తున్నారు.. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల లోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్లల్లో వస్తున్న నీటితో పాటు సర్పాలు కూడా వస్తున్నాయని ప్రజలు చెప్పుకోస్తున్నారు.. చీకట్లోనే జనాలు బిక్కు బిక్కుమంటున్నారు..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అలాగే మరోవైపు అటు నిజామాబాద్ జిల్లా బోధన్‌లో భారీ వర్షాలతో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని గోదావరి, మంజీర నదులకు వరద పోటెత్తింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సాలుర మంజీర నది పాత వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మహారాష్ట్రలోని బిలోలి – బోధన్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో పలు గ్రామాల్లో పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి నెల రోజులు దాటిపోయినా వానలు సకాలంలో కురవకపోవడంతో 30 శాతానికిపైగా లోటు వర్షపాతం కొనసాగింది. అయితే గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి తలకిందులైంది. దీంతో లోటు పూడిపోవడమేగాక 6 శాతం అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. వానాకాలం సీజన్‌లో జూలై 20 నాటికి 26.46 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. గురువారం నాటికి 27.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది..ఇంక రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!