రానున్న రెండు రోజులు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపిన వాతావరణ శాఖ మరో రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం, గురువారం అతి నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగుకు ఆధారంగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నేటితో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. 1963 జులై 26న నాటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద శంకుస్థాపన చేసి.. దీనిని ఒక ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు.
ఎడతెరిపి లేని వర్షాలకు రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల వాగులు ఉప్పొంగడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సిద్దిపేట జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
Red Alert issued for Next Two Days in Hyderabad: రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరం అయితేనే బయటికి రావాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా…
తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరం నానిపోయింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నగరవాసులు.
Selfie Madness: దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ వర్షాల కారణంగా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్ లో మాత్రం పరిస్థితి దారుణంగా మారిందని చెప్పాలి.. భారీగా కురిసిన వర్షాలకు వరదలు ఎక్కువగా వస్తున్నాయి.. భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత 75 ఏండ్లలో ఎన్నడూలేనంతగా వానలు కురవడంతో రాష్ట్రం వణిపోయింది. వరదలు పోటెత్తడంతో రోడ్లు, ఇండ్లు కొట్టుకుపోయాయి. సుమారు వందకు పైగా మరణించారు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.8 వేల కోట్ల మేర నష్టం వాటిళ్లిందని ముఖ్యమంత్రి…
సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్‌లో కుండపోత వర్షం కారణంగా రాత్రిపూట ఆకస్మిక వరదలు సంభవించి మరణించిన వారి సంఖ్య 26కి పెరిగిందని, 40 మందికి పైగా గల్లంతయ్యారని అధికారులు ఆదివారం తెలిపారు.