తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. నేడు హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది.
Bhadrachalam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి 54.7 అడుగులకు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే గోదావరికి వరద కొద్దిగా తగ్గింది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
Central Team: నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎంఎ) సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖ బృందం సోమవారం నుండి రాష్ట్రంలోని వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేయనుంది.
కొండాయి గ్రామంలో పర్యటించిన మంత్రి వరదలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులకు అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి సత్యవతి రాథోడ్ బరోసా ఇచ్చారు. అనంతరం వరద బాధితులకు ఆమె ఆహారం అందించారు. రవాణా సౌకర్యం కొరకు కూలిపోయిన బ్రిడ్జినీ పునర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
Kishan Reddy: హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ నేత జి.కిషన్ రెడ్డి పర్యటించారు. యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, అంబర్‌పేటలో ప్రస్తుత పరిస్థితిని తెలియజేసి మురుగు కాలువలు, ఇంకుడు గుంతలు పొంగిపొర్లడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు.
మొరంచపల్లి గ్రామం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది ఏ ఇంటిని కదిలించిన ఒక కన్నీటి గాదె వినిపిస్తున్నారు ..సుమారు 12 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవన సాగించి గ్రామస్తులు నీటి ఉధృతి తగ్గిన తర్వాత తమ ఇంటి పరిస్థితులు చూసుకొని కన్నీరు మున్నేరుగా వినిపిస్తున్నారు. ఆప్తులను కోల్పోయిన వాళ్లు మేము ఎందుకు బ్రతికున్నామంటూ ఏడుస్తున్నరు. భూపలపల్లి జిల్లా గణపురం మండలంలోని మోరంచపల్లి జల దిగ్బంధంలో చిక్కుకుంది. breaking news, latest news, telugu news, Bhupalpally Floods,…
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమావేశం చేపట్టిన ముఖ్యమంత్రి.. పలువురు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత, సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.