తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల కురవడం వల్ల రోడ్లన్ని జలయమం అవుతున్నాయి.. గత రాత్రి నుంచి చెన్నై తో పాటు 15 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోయంబత్తూరు, తిరువూర్, మధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో మంగళవారం కుండపోత వాన పడింది..
ఈ క్రమంలో ఈ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.. ఇప్పటికే కారైక్కాల్, కడలూరు, విల్లుపురం, నాగపట్నం జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. పుదుచ్చేరిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తమిళనాడు కోస్తా ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది..
మరో రెండు రోజులపాటు 27 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.. లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు తెలిపారు.. ముందస్తు చర్యల్లో భాగంగా 4,917 సహాయక శిభిరాలను, 121 తుఫాన్ షెల్టర్లను ఏర్పాటు చేశామని రెవిన్యూ అధికారులు తెలిపారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పునరావాసు కేంద్రాలను పరిశీలించారు.. గత రాత్రి చెన్నైలో భారీగా వర్షాలు కురిశాయి.. చెన్నై నుంచి వెళ్ళవలసిన పలు విమానాలను కూడా రద్దు చేశారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.. చెన్నై వర్షాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..