అసోంలో ఈ ఏడాది భారీ వర్షాలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు వందలాది మంది వర్షాలు, వరదలు కారణంగా మృతి చెందారు. 12 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి జోగెన్ మోహన్ శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో తెలిపారు.
గత కొన్ని వారాలుగా హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే వారి కష్టాలు ఇప్పట్లో తగ్గేట్టు కనిపించడం లేదు. మండి సహా రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
దేశంలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాలకు IMD హెచ్చరిక జారీ చేసింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Heavy Rains in Uttar Pradesh: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వానలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా వరుస వర్షాలు కురవడంతో వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఉత్తరప్రదేశ్ లో అయితే ఈ వరదలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం మొదలు సోమవారం తెల్లవారు జాము వరుకు ఆగకుండా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఇక ఇలాంటి పరిస్థితే మరో నాలుగురోజులు పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ…
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో వర్షాల కారణంగా 19 మంది చనిపోయారు. అటు ఉత్తరాఖండ్‌లో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. మరోవైపు పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.
కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసి ఎండిపోయిన ప్రాంతంలోని నీటి వనరులకు జీవం పోశాయి.. ఆగస్ట్‌లో సుదీర్ఘ పొడి స్పెల్ తర్వాత, కలబురగి, బీదర్, యాద్గిర్ మరియు కొప్పల్ జిల్లాల్లో రాత్రిపూట మరియు ఆదివారం పదునైన జల్లులు కురిశాయి, ఆలస్యంగా విత్తిన రైతులకు ఆనందం కలిగించింది.. అయితే, రాబోయే కొద్ది రోజుల్లో ఇలాంటి మరిన్ని వర్షాలు కురిస్తే, కోతకు సిద్ధంగా ఉన్న పచ్చిమిర్చి మరియు ఉడకబెట్టిన పంటలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కలబురగి జిల్లా…
తెలంగాణకు హైదరాబాద్ వాతావారణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండ్రోజుల పాటు పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షసూచన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.