బెంగళూరు నగరంలో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కురుస్తున్న కుండపోత వర్షాల ధాటికి రాష్ట్రం లో పలు చోట్ల జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. కాగా సోమవారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి బెంగళూరు లోని వెస్ట్ డివిజన్ లోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ ఆయుధశాల గోడ కూలిపోయింది. దీనితో వర్షపు నీరు గది లోకి ప్రవేశించింది. గది లోకి నీరు చేరడం వల్ల గదిలో ఉన్న ఆయుధాలు అన్నీ జలమయం అయ్యాయి. గది లోకి నీరు చేరడంతో గదిలో ఉన్న SLR రైఫిల్, AK47, 9 mm పిస్టల్ మరియు పంప్ యాక్షన్ గన్ సహా 210 ఆయుధాలు దెబ్బతిన్నాయి.
Read also:Samantha: ‘బజార్’ కోసం మళ్ళీ హద్దులు దాటేసిన సమంత
ఈ నేపథ్యంలో వర్షపు నీటిలో తేలుతున్న ఆయుధాలను పోలీసు సిబ్బంది పొడి ప్రాంతానికి తరలించారు. తుపాకుల్లోకి నీరు, ధూళి ప్రవేశించాయి. దీనితో సాయుధ రిజర్వ్ సిబ్బంది తడిసిన తుపాకులను శుభ్రం చేసి వాటిని పొడి ప్రాంతంలో ఆరబెట్టారు. కాగా వర్షపు నీరు గదిలోకి ప్రవేశించడం వల్ల లక్షల రూపాయలు విలువ గల ఆయుధాలు దెబ్బతిన్నాయి. తడిసిన ఆయుధాలను శుభ్రం చేయడానికి, ఆరబెట్టడానికి సిబ్బంది చాల ఇబ్బంది పడ్డారు అని సమాచారం. నాసిరకం పనుల వల్లే గోడ కూలిపోయిందని పోలీసు సిబ్బంది ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.