రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి సూచించారు. పెద్ద వాగు వరద పరిస్థితిపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
AP-Telangana: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తు నివారణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాధ్ వెల్లడించారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపారు.
Red Alert: రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Nepal: నేపాల్ దేశాన్ని భారీ వర్షాలు భయపెడుతున్నాయి. వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల దేశవ్యాప్తంగా 14 మంది మరణించారు. మరో 9 మంది గల్లంతైనట్లు అక్కడి పోలీసులు ఆదివారం తెలిపారు.
Char Dham Yatra: ఉత్తరాఖండ్ లోని గర్వాల్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ఆదివారం చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జూలై 7, 8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యాత్రికుల భద్రత దృష్ట్యా యాత్రను వాయిదా వేస్తున్నట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. ఈ రెండు రోజుల్లో గర్వాల్ డివిజన్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.…