Southwest Monsoon: విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. ఐదు రోజుల పాటు వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Southwest Monsoon: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో నేడు, రేపు (సోమ, మంగళ)వారాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇక రానున్న ఐదు రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దీంతో.. రుతుపవనాలు వేగంగా విస్తరించడం, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ ప్రభుత్వం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read
Read also: Fake Note: టీజీగా మార్చేందుకు రూ.2,767 కోట్లు.. ఫేక్ నోట్ పై సర్కారు సీరియస్..
కాగా.. హైదరాబాద్‌లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీని 040-21111111, 9001136675 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఇక ఏపీలో కూడా కొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ.. రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
ఇక తెలంగాణలో పగటిపూట 27 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది. ఏపీలో 27 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ నమోదవుతోంది. తెలంగాణలో సోమ, మంగళవారాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
Rajahmundry: గోదావరిలో క్రమేపీ పెరుగుతున్న నీటిమట్టం
తాజావార్తలు
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?