రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నీటితో నిండిపోయాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 1-2 లక్షల క్యూసెక్కుల నీరు వాగుల్లో ద్వారా వచ్చే ప్రమాదముంది.. ప్రకాశం బ్యారేజీకి వరద పొటెత్తుతోంది.. రేపటికల్లా ప్రకాశం బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే సూచనలున్నాయి.. దిగువ ప్రాంతాల్లో సహయక చర్యలు తీసుకుంటున్నాం.. బండ్స్ పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
దేశంలో వర్షాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ(IMD) కొత్త నివేదికను విడుదల చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సెప్టెంబర్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నివేదిక ప్రకారం.. ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో.. అక్కడ వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపింది.
Cancelled Trains: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు వణుకుతున్నాయి. వర్షాలు, వరదల ముప్పు పెరుగుతోంది.. దీంతో వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది.
ఏపీలో వర్షాలు, వరదలపై హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలను వర్షాలు, ముంచెత్తాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర మొత్తమ్మీద ముంపు బారిన పడిన 294 గ్రామాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 13, 227 మందిని ప్రభుత్వ పునరావాస శిబిరాలకు ప్రభుత్వం తరలించిందని పేర్కొన్నారు.
భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. జిల్లాలు, శాఖల వారీగా తాజా పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై చంద్రబాబు రివ్యూ చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా రియల్ టైంలో పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలని సీఎం ఆదేశించారు.
Heavy Rains: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దయింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తు న్నాయి.
భారీ వర్షాలు విజయవాడ, గుంటూరు నగరాలను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. బెజవాడలో రికార్డ్ వర్షపాతం నమోదైంది. 30 ఏళ్ల రికార్డ్ బద్దలైంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెంటిమీటర్ల వర్షపాతం కురిసింది. రెండు రోజులు విజయవాడలో కుండపోత వర్షం కురవడంతో అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది.
తుంగభద్ర డ్యామ్ మళ్లీ నిండుకుండలా మారింది. డ్యామ్ అధికారులు ఇవాళ గేట్లు ఎత్తనున్నారు. గేట్లు ఎత్తనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తుంగభధ్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయి స్టాప్ లాగ్ ఎలిమెంట్ ఏర్పాటు తరువాత డ్యామ్ మళ్లీ నిండడం గమనార్హం. గేటు కొట్టుకుపోయి భారీగా నీరు వృథా అయినా వరుణుడు మళ్లీ కరుణించాడు.