Vijayawada: చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. బెజవాడలో రికార్డ్ వర్షం
- బెజవాడలో రికార్డ్ వర్షం
- 30 ఏళ్ల రికార్డ్ బద్దలు
- చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెంటిమీటర్ల వర్షపాతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: భారీ వర్షాలు విజయవాడ, గుంటూరు నగరాలను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. బెజవాడలో రికార్డ్ వర్షపాతం నమోదైంది. 30 ఏళ్ల రికార్డ్ బద్దలైంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెంటిమీటర్ల వర్షపాతం కురిసింది. రెండు రోజులు విజయవాడలో కుండపోత వర్షం కురవడంతో అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది. విజయవాడలో కనివినీ ఎరగని రీతిలో కురిసిన వర్షానికి నగర జీవనం అస్తవ్యస్తమైంది. ఎప్పుడూ చూడని రీతిలో బెజవాడలో కుంభవృష్టిలా వర్షం పడడంతో కాలనీలన్ని నీటమునిగాయి. ఏకధాటిగా రోజంతా వర్షం కురవడంతో వరదలు నగరాన్ని ముంచెత్తాయి. నగరం జలదిగ్బంధంలో చిక్కి విలవిల లాడుతోంది. ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు కొండచరియలు విరిగిపడడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలోని విద్యాధరపురం, ఆర్‌ఆర్ నగర్‌లో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది.
Read Also: Rajanna Sircilla: ఏడతెరపి లేకుండా వర్షాలు.. వానలో తడుస్తూనే రాజన్న దర్శనం..
Also Read
- SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
- Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా 'వెజ్ సూప్' ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
- Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
భారీ వర్షాలకు మొఘల్రాజపురం సున్నపు బట్టీ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలకు వర్షం పలుమార్లు ఆటంకం కలిగించింది. విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాలు నీటమునిగాయి. రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది.
తాజావార్తలు
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!