High Alert For AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ, వాయువ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
AP Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ వరద పరిస్థితులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడం చాలా తేలిక.. కానీ, మా ప్రభుత్వం వచ్చి 100 రోజులు మాత్రమే అయింది.. బుడమేరు 90 శాతం ఆక్రమణలలో ఉంది అన్నారు. అదే శాపంగా మారి బెజవాడను వరద నీటితో నింపింది.
Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి భాతర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడుతూ.. అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ సూచించింది.
Vijayawada Floods: విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల అండగా ఉండాల్సింది పోయి.. కొందరు ప్రైవేట్ వ్యాపారులు దానికి క్యాష్ చేసుకుంటున్నారు. ఇంకా, వరద ప్రభావం నుంచి తేరుకోని విజయవాడను బుడమేరు వాగు నిండా ముంచేసింది. ఓవైపు ప్రజల ఆకలి కేకలు.. మరోవైపు వ్యాపారుల దోపడితో అల్లాడిపోతున్నారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు.
TG Rain Alert: భారీ వర్షాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Vehicles Washed Away In Floods: విజయవాడలో భారీ వర్షాలు, వరదలతో నగరంలో పెద్ద ఎత్తున వెహికిల్స్ కొట్టుకుపోయాయి. దీంతో వాహనాల కోసం యజమానుల వెతుకుతున్నారు. కిలో మీటర్ల దూరం పాటు వరదలో వాహనాలు కొట్టుకుపోయాయి.
AP Govt: వరద విధ్వంసం నుంచి విజయవాడ నగరం నెమ్మదిగా కోలుకుంటుంది. కాలనీల దగ్గర వరద నీరు తగ్గుతుంది. వరద నీరు పూర్తిగా పోవడానికి మరో రెండ్రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు, బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Vijayawada Floods: విజయవాడను వాన ముప్పు వీడటం లేదు.. దీంతో రాత్రి నుంచి ఓ మోస్తారు వర్షం ప్రారంభం కావటంతో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది.
Heavy Rain: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాల వర్షాలు కురుస్తున్నాయి.