Red Alert: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. జన జీవనంత అస్తవ్యస్తంగా మారింది.
అధిక వర్షాల నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలు మరికొద్ది రోజులు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నందున ప్రజల ఆరోగ్యం పట్ల వివిధ స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సీఎస్‌కు ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి…
గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పెదకాకాని మండలం ఉప్పలపాడు-గోళ్లమూడి మధ్య ఉద్ధృతికి కాలువలో కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న టీచర్ రాఘవేంద్ర, పిల్లలు సాత్విక్, మానిక్ మరణించినట్లు తెలిసింది. ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
హైదరాబాద్ లో దొంగల హల్ చల్.. రూ.35 లక్షలు దోపిడీ.. హైదరాబాద్ లో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. నగరంలో దారి దోపిడీ దొంగల ముఠా అమాయకులను హడలెత్తిస్తున్నారు. వ్యాపారస్తులే టార్గెల్ చేస్తూ ప్రజలను భయాభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాత్రి ఒంటరి వ్యక్తులే టార్గెట్ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యాపారి వద్ద నుంచి సుమారు రూ.35 లక్షలు దోచుకుని వెళ్లిన ఘటన గుడిమల్కాపూర్ లో సంచలనంగా మారింది. హైదరాబాద్ గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలోని తిబర్మల్ జ్యువెలర్స్…
భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. భారీ వర్షాలున్న ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చు అన్నారు సీఎం.. పెన్షన్ పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావద్దని.. టార్గెట్లు పెట్టవద్దని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. అయితే, వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.. ఈ రోజు కర్నూలు జిల్లా ఓర్వకల్ లో చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా.. వాతావరణంలో మార్పులు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆ టూర్‌ను క్యాన్సిల్ చేశారు..
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాలతో ఆయా చోట్ల పరిస్థితులపై అధికారులతో మాట్లాడిన సీఎం.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చెయ్యాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు..
భారీ వర్షాల నేపథ్యంలో.. ఇప్పటికే పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు.. ఈ రోజు ఇప్పటికే గుంటూరు, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.