AP and Telangana Rains LIVE UPDATES: వాయుగుండం తీరం దాటింది. ఆదివారం అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం వాయుగుండం వాయవ్యంగా పయనిస్తోంది. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా జారీ అయింది. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో పలు రైళ్లను రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఏపీలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని నిషేధం విధించారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
మహబూబాబాద్ జిల్లా సీతారాంతండాను ముంచెత్తిన వరద.. వరదలో చిక్కుకుపోయిన జీపు.. జీపులో ఒకే కుటుంబానికి 9 మంది.. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది.. తాళ్ల సాయంతో 9 మందిని రక్షించిన ఫైర్ సిబ్బంది.. ఆ తర్వాత వరదలో కొట్టుకుపోయిన ఖాళీ..
HYD: మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కారణంగా పోలీసుల నిర్ణయం. ఐటీ కంపెనీలు, ఐటీ ఈఎస్‌కు సూచించిన సైబరాబాద్ పోలీసులు. ఉద్యోగుల భద్రత రీత్యా వర్క్‌ఫ్రం హోంకు అనుమతి ఇవ్వాలని సూచన. ఐటీ కంపెనీలకు వర్క్‌ఫ్రం హోం అనుమతించాలి. -పోలీసులు
ఖమ్మం- విజయవాడ ప్రయాణాలు వాయిదా వేసుకోండి.. విజయవాడ- హైదరాబాద్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి.. నందిగామ- చిలకల్లు వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరు.. సూర్యాపేట- ఖమ్మం హైవే నాయికిగూడెం దగ్గర వరద ప్రవాహం.. హైవేపై ప్రమాదకర స్థాయిలో వరద ప్రవాహం.. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పాడుతుంది.. రోడ్లను వరద ముంచెత్తడంతో వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేదు- సూర్యాపేట ఎస్పీ
సీఎం చంద్రబాబుకు కేంద్రహోంమంత్రి అమిత్ షా ఫోన్.. ఏపీలోని వరద పరిస్థితులను అమిత్ షాకు వివరించిన చంద్రబాబు.. అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని అమిత్ షా హామీ..
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు. సింగ్‌నగర్ వరద ప్రాంతాల్లో పర్యటించిన తరువాత విజయవాడ కలెక్టరేట్‌లో సీఎం సమీక్ష. లక్ష మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలన్న సీఎం చంద్రబాబు. సహాయక చర్యల కోసం అదనపు బోట్లు ట్రాక్టర్లు తెప్పించాలని ఆదేశం. సాధారణ స్థితి వచ్చే వరకు కలెక్టరేట్‌లోనే బస చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం.
దోర్నాల శ్రీశైలం ఘాట్‌రోడ్డులో భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండచరియలు. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డును మూసివేసిన పోలీసులు. మన్ననూరు చెక్‌పోస్ట్ దగ్గర వాహనాలు నిలిపివేత.
బాపట్ల: కొల్లూరు (మం) అరవింద వారధి వద్ద కృష్ణానదికి గండి. ఇటుక బట్టీ, పంట పొలాల్లోకి ప్రవహిస్తున్న నీరు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల. వరద ప్రభావం మరింత పెరిగే అవకాశం.
ములుగు: ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి సీతక్క.. గుండ్లవాగు, జనగలంచవాగులను పరిశీలించిన సీతక్క.. వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం..
వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటాం.. అందరికి న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటా.. ఇంకా రెస్య్కూ సిబ్బందిని ఏర్పాటు చేస్తాం.. ప్రతి ఒక్కరికి తినడానికి ఆహారంతో పాటు ఉండటానికి సదుపాయం కల్పిస్తాం- సీఎం చంద్రబాబు
భారీ వర్షాలకు ఖమ్మం మున్నేరు బ్రిడ్డికి పగుళ్లు.
ప్రాజెక్టుల నీటి లభ్యతపై సీఎం రేవంత్ సమీక్ష. రిజర్వాయర్లు నింపనున్న తెలంగాణ ప్రభుత్వం. మిడ్ మానేరు, లోయర్ మానేరు, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్‌లకు నీరు లిఫ్ట్ చేయనున్న ప్రభుత్వం. రంగనాయకసాగర్ నుంచి మల్లన్న సాగర్.. కొండపోచమ్మ రిజర్వాయర్‌లు నింపనున్న అధికారులు. కొండపోచమ్మ నుంచి సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టు వరకు నీరు.
విశాఖపట్నం నావెల్ బేస్ నుంచి డిఫెన్స్ హెలికాఫ్టర్ రప్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మున్నేరు వాగు బ్రిడ్జిపై చిక్కుకున్న బాధితుల్ని రక్షించేందుకు వస్తున్న హెలికాఫ్టర్.. బ్రిడ్జ్ పై వరదలోనే చిక్కుకున్న 9 మంది.. వాతావరణం అనుకూలించకపోవడంతో తెలంగాణలో ఉన్న హెలికాఫ్టర్లు పని చేయని పరిస్థితి.. దీంతో విశాఖ నావెల్ బేస్ నుంచి డిఫెన్స్ హెలికాఫ్టర్ తెప్పిస్తున్న తెలంగాణ సర్కార్..
కృష్ణా జిల్లా గొల్లపూడిని ముంచెత్తిన వరద. శ్రీశైలం కాలనీలో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న వ్యక్తి. కాపాడాలంటూ ఆర్తనాదాలు.
విజయవాడ సింగ్నగర్లో వరద బీభత్సం.. సింగ్నగర్ వరద ప్రాంతాన్ని పరిశీలిస్తున్న చంద్రబాబు.. పూర్తిగా నీట మునిగిన విజయవాడ సింగ్నగర్.. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలింపు..
కోదాడ-ఖమ్మం మధ్య తెగిన లింక్ రోడ్డు. పెద్ద చెరువు నుంచి కాలనీల్లోకి చేరుతున్న వరద. సహాయక చర్యలు చేపట్టిన ఫైర్ సిబ్బంది.
నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి. నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద కాలువకు గండి. పంట పొలాల్లోకి ఉధృతంగా వరద నీరు. పంట పొలాల్లోకి, గ్రామాల్లోకి భారీగా వరద. వరద పెరగడంతో ఊరు ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రజలు. గండిపడటంతో హుటాహుటిన ఎడమ కాలువకు నీటి విడుదల నిలిపివేసిన అధికారులు.
వర్షాల కారణంగా 9మంది మృతి చెందారు. జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశాం. సహాయక చర్యల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. -సీఎం చంద్రబాబు
వర్షాలపై అన్ని జిల్లాల కలెక్టర్లకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు. రెస్క్యూ టీమ్‌లను ఏర్పాటు చేసుకోవాలని హైడ్రాకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం. వరద ముంపు ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్లకు భట్టి ఆదేశం. వరదనీరు ఉధృతంగా ప్రవహించే రోడ్లపై వాహనాలను అనుమతించొద్దని పోలీస్ శాఖకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం.
విజయవాడ సింగ్‌నగర్‌లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.. భారీ వర్షాలతో నీట మునిగిన సింగ్‌నగర్ పరిసర ప్రాంతాలు.
పూర్తిగా నీట మునిగిన విజయవాడ సింగ్ నగర్. బాధితులను పునరావస కేంద్రాలకు తరలిస్తున్న రెస్క్యూ సిబ్బంది. కాసేపట్లో విజయవాడలోని సింగ్‌నగర్‌కు వెళ్లనున్న సీఎం చంద్రబాబు. భారీ వర్షాల వల్ల నీట మునిగిన సింగ్ నగర్ ప్రాంతాన్ని పరిశీలించనున్న చంద్రబాబు.
పూర్తిగా నీట మునిగిన ఖమ్మం ప్రకాష్‌నగర్. మొదటి అంతస్తు వరకు చేరుకున్న నీళ్లు. ఇళ్లను ఖాళీ చేయిస్తున్న అధికారులు.
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు, ఈదురు గాలులకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కీసరలో నిన్న సాయంత్రం నుండి ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఆదివారం ఉదయం కీసర ఎస్సీ కాలనీలోని 11వ వార్డులో పండ్రు నారాయణ ఇల్లు గోడ కూలిపోయింది. నాగారంలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. నాగారం 13వ వార్డులోని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద రావి చెట్టు నేలకొరిగింది. నాగారం రాంపల్లి చౌరస్తాలో రోడ్డుపై మోకాళ్ళ లోతు నీళ్ళు ప్రవహిస్తున్నాయి. నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి మున్సిపాలిటీ అధికారులు, సిబ్బందితో కలిసి వరద ముంపు ఉన్న ప్రాంతాలను పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చందానగర్, మియాపూర్, మదినగూడ, లింగంపల్లి, కొండాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్, పరిసర ప్రాంతాల్లో నిన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి లింగంపల్లి లోని రైల్వే అండర్ పాస్ కింద నీరు చేరడంతో వాహనాల రాకపోకల అంతరాయం ఏర్పడింది.అండర్ పాస్ వద్ద బారికేడ్లు వేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
షాద్ నగర్ నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తుంది. చెరువులు, కుంటలు వాగులు పొంగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అధికారులు సెలవులు పెట్టొద్దన్నారు. స్థానిక పరిస్థితుల మేరకు రేపు స్కూల్స్ కు సెలవులు ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఖమ్మంలో నాకు కావాల్సిన ఓ ముస్లిం కుటుంబం వరదల్లో చిక్కుకుంది. వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మాట్లాడారు. కేంద్రం నుంచి కావాల్సిన తక్షణ సహాయం అందిస్తామని చెప్పారు.
శేరిలింగంపల్లి రైల్వే బ్రిడ్జి దగ్గర వరద నీరు చేరింది. ఇరువైపులా వాహనాల రాకపోకల నిలిపివేత, రెండు చెరువులు నిండటంతో భారీగా రోడ్డు పైకి చేరుకుంటున్న నీరు,భారీకేడ్లనం ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను దారి మళ్ళిస్తున్న సిబ్బంది,వర్షం వచ్చిందంటే చాలు శేరిలింగంపల్లి వాసులకు తప్పిని తిప్పలు.
అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి అన్నారు. వృద్దులు, చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపకండన్నారు. ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులంతా చర్యలు తీసుకోండన్నారు. బీజేపీ కార్యకర్తలారా....జాగ్రత్తగా ఉంటూ సహాయక చర్యల్లో నిమగ్నమవ్వండన్నారు.
మంత్రి పొంగులేటికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితిని బండి సంజయ్ ఫోన్ లో అడిగి తెలుసుకున్నారు. ఏదైనా అత్యవసరం అయితే తనను సంప్రదించాలని కోరారు. హుటాహుటిన ఖమ్మంకు బయలుదేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
రాష్ట్రానికి మరో 24 గంటల పాటు భారీ వర్ష సూచన. ఎనిమిది జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన ఉండటంతో రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్. పద్నాలుగు జిలాల్లో భారీ వర్ష సూచన ఉండటంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..
అమరావతి: రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యాలయానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్ కార్యాలయం నుంచి వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. వర్ష ప్రభావం, వాతావరణ పరిస్థితులపై సమీక్ష చేపట్టారు. వరద ఉధృతి ఎక్కడెక్కడ ఎక్కువగా ఉందని సీఎం ఆరా తీశారు. ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లోస్.. బ్యారేజీ దిగువ ప్రాంతాల్లో తీసుకున్న చర్యలపై వివరాలు కోరుతున్నారు.
ఖమ్మం పట్టణంలోని కరుణగిరి మున్నేరు వాగు బ్రిడ్జిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. మున్నేరు వాగు వరద ఉధృతి తీవ్రంగా ఉండడంతో బ్రిడ్జిపై వాహనాలను అనుమతించొద్దని పోలీస్ శాఖను ఆదేశించారు. మున్నేరు వాగు వరద ప్రవాహంలో ముంపునకు గురైన ఇండ్లు, వాహనాలు ఫంక్షన్ హాల్ ను పరిశీలించారు.
వరదల కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం.. మహబూబాబాద్ ఇంటికన్నె దగ్గర కొట్టుకుపోయిన రైల్వేట్రాక్.. రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనులకు అంతరాయం.. రైల్వేట్రాక్ పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు.. వరద ధాటికి పూర్తిగా కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్.. ఢిల్లీ నుంచి సౌత్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం.. రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనులకు వర్షం అడ్డంకి.. రేపటిలోగా వరద ఉధృతి తగ్గిన వెంటనే మరమ్మతుల చేపడతామంటున్న రైల్వే అధికారులు.
తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై భారీ వృక్షం పడిపోయింది. ట్యాంక్ బండి మీద ఉన్న వృక్షాలలో ఒక భారీ వృక్షం తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై అడ్డంగా పడటంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. టిఆర్ఎస్ టీం భారీ వృక్షాన్ని తొలగిస్తున్నారు. ట్రాఫిక్ ని దారీ మళ్లించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై సెక్రటేరియట్ వైపు నుంచి ఇందిరాపార్కు వైపు వచ్చే వాహనాలను నిలిపివేశారు.
ఏపీలో వర్షాలు, వరదలపై హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలను వర్షాలు, ముంచెత్తాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర మొత్తమ్మీద ముంపు బారిన పడిన 294 గ్రామాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 13, 227 మందిని ప్రభుత్వ పునరావాస శిబిరాలకు ప్రభుత్వం తరలించిందని పేర్కొన్నారు. వర్షాలు, వరదల కారణంగా తొమ్మిది మంది మృతి చెందినట్టు మంత్రి అనిత అధికారికంగా ప్రకటించారు. 14 జిల్లాల పరిధిలో 1,56,610 ఎకరాల్లో వరిపంట మునగినట్లు హోంమంత్రి తెలిపారు. 18,045 ఎకరాల మేర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. ఏడు జిల్లాల్లోని 22 ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మొత్తంగా 9 ఎన్డీఆర్‌ఎఫ్, 8 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల కోసం బోట్లు, ఓ హెలికాఫ్టర్ ప్రభుత్వం సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ వరంగల్ హైవే రోడ్డుపై రఘునాథ్ పల్లి వద్ద భారీగా వరద నీరు చేరటంతో రాకపోకలకు అంతరాయం భారీగా నిలిచిన వాహనాలు. దుర్గం చెరువు , మాదాపూర్ మెయిన్ రోడ్ లో నిలిచిపోయిన వరద నీరు. మాదాపూర్ దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో భారీగా వరదనీరు. నెక్టర్ గార్డెన్ తోపాటు పలు కాలనీలోకి వరదనీరు. దుర్గం చెరువు, మాదాపూర్ మెయిన్ రోడ్ లో నిలిచిపోయిన వరద నీరు .
మాదాపూర్ దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరింది. నెక్టర్ గార్డెన్ తోపాటు పలు కాలనీలోకి వరదనీరు.
నగరంలో రెడ్ అలెర్ట్ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి సూచించారు. సిటీలో 141 వాటర్ లాగింగ్ పాయింట్ ల వద్ద స్టాటిక్, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు ఎప్పటికప్పుడు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసర టెలికాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓ కార్యాలయానికి పంపాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అత్యవసర పని ఉంటే తప్ప బయటకు రావద్దని రేవంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అవసరం ఉంటే అధికారులకు ఫోన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రకాశం బ్యారేజీకి రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 70 గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తివేశారు. సముద్రంలోకి 7,39,529 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాలువలకు 500 క్యూసెక్కుల విడుదల చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7,40,029 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ నీటిమట్టం 17.3 అడుగులుగా ఉంది.
నంద్యాలకు వరద ముప్పు పొంచి ఉంది. కుందూనది , మద్దిలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గంటగంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. కుందూ, మద్దిలేరు ప్రాంతాలను మంత్రి ఫరూక్ పరిశీలించారు. నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమతంగా ఉండాలన్నారు.
విజయవాడలో బుడమేరు ఉధృతితి ఇందిరా నాయక్ నగర్, సింగ్ నగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇందిరా నాయక్ నగర్‌లో ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.. దీంతో ఇళ్లలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న పలువురిని బయటకు తీసుకువచ్చేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. తాళ్ళ సాయంతో వారిని రక్షించిన బృందాలు బయటకు తీసుకువస్తున్నారు.. బుడమేరు వాగు నీరు రోడ్డుపై ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచి పోయింది. రాజరాజేశ్వరిపేట నుంచి వైఎస్ఆర్ కాలనీ వెళ్ళే వాహనాలకు అంతరాయం ఏర్పడింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని భూపతిపాలెం రిజర్వాయర్ గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. భూపతిపాలెం రిజర్వాయర్ రెండు గేట్లను ఎత్తి సుమారు 600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
హైదరాబాద్ లో భారీ వర్షాలకు గాంధీ భవన్‌లో గోడ కూలింది.
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని ఆలేరు గ్రామంలోని చెరువు కట్ట తెగింది. కట్ట తెగడం వల్ల లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. 48 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలన్నారు.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద ఎగువ నుండి వస్తున్న వరద నీటితో మోయ తుమ్మెద వాగు ప్రవాహం పెరిగింది. హన్మకొండ - సిద్దిపేట ప్రధాన రహదారిపై బారికేడ్లతో వాహనాల రాకపోకలను నిలిపివేసి, దారి మళ్లించిన పోలీసులు.
జనగామ జిల్లాలో ఉదయం నుండి ఎడతెరపీ లేకుండా భారీ వర్షం కురుస్తుంది. జనగామ -హుస్నాబాద్ రహదారిలో వడ్లకొండ వాగు ఉద్రుతంగా ప్రవహిస్తుండడంతో నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద తెగిపోయిన తాత్కాలిక రోడ్డు. కుందారం వద్ద వాగు ఉధృతికి తెగిపోయిన రోడ్డు. జనగామ,నర్మెట్ట,తరిగోప్పుల మండలం పరిసర గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. రఘునాథపల్లి లో వరంగల్ -హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా నిలిచిపోయిన వరద నీరు. దీంతో ఎక్కడెక్కడ స్తంభించిన ట్రాఫిక్. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. ఓ వైపు జనగామ పట్టణంలో జలమయమైన పలు కాలనీలు. వర్షభావ పరిస్థితులతో అప్రమత్తమైన అన్ని శాఖల జిల్లా అధికారులు..
తెలుగు రాష్ట్రాల్లో రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు దంచికొడుతు న్నాయి. వాన ధాటికి ప్రజా జీవనం అస్తవ్యస్తమవు తుంది. అయితే హైదరాబాద్‌లోని ఓ రైతు బజార్లో ఈరోజు ఉదయం కురిసిన భారీ వర్షానికి పలు కూరగాయల దుకాణాల్లోని ఆకుకూరలు కూరగాయలు నీటిలో కొట్టుకుపోయాయి. ఇది చూసిన అక్కడి స్థానికులు వాటిని ఏరుకుని సంచిలో వేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
సిద్దిపేట జిల్లాని వాన ముంచెత్తింది. మూడున్నర గంటల్లోనే సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో 13 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లాలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు. నారాయణరావుపేటలో 12 సెం. మీ, రాఘవపూర్ 11.8 సెం. మీ వర్షపాతం నమోదైంది. దుర్గంపల్లి- సిక్లిందాపూర్ మధ్య నీటి ఉదృతికి రాకపోకలు బంద్. ఖాతా వాగు పొంగడంతో జాలపల్లి-ఖాతా గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు. చేర్యాలలో తాడూరు వాగు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్.
బలహీనపడుతున్న వాయుగుండం.. విశాఖకు 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం.. వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం.
రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల విజయవాడలో చాలా భాగం ముంపుకు గురైంది. విజయవాడలో కాలనీలన్నీ ముంపుకు గురిగాక ఆ కాలనీలో ఉన్న ప్రజలు మాత్రం తీవ్ర ఎకట్ల గురవుతున్నారు. పశువుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కొంతమంది పశువులని డాబాల మీదికి ఎక్కించారు. వరదలో పశువులని కాపాడుకోండి కోసం నానా ఇక్కట్లు పడుతున్నారు. కనీసం మంచినీళ్లు కూడా తమ ఇండ్లలో లేవని అధికారులు ఎవరూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.