AP and Telangana Rains LIVE UPDATES: వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం వాయుగుండం వాయవ్యంగా పయనిస్తోంది. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది.. వర్షాలు, వరదల దెబ్బకి విమాన ప్రయాణాలకు డిమాండ్ వచ్చింది.. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, రైలు మార్గాలలో అంతరాయం ఏర్పడడంతో... గన్నవరం విమానాశ్రయంలో రద్దీ పెరిగిపోయింది.. అయితే, పెరిగిన రద్దీతో టికెట్ కౌంటర్ల వద్ద భారీగా క్యూలైన్‌లు దర్శనమిస్తున్నాయి.
రేపు కూడా తెలంగాణలోని దాదాపు 11 జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. రానున్న 24 గంటలలో భారీ వర్షాలు కురిసే హెచ్చరికలున్న 11 జిల్లాలైన ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపెల్లి, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాల్లో వరదల పరిస్థితి,…
భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు వరుసగా ఈ నెల 3వ తేదీన సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తూ వస్తుంది.. కొన్ని రైళ్లను రద్దు చేస్తే.. మరికొన్ని సర్వీసులను దారి మళ్లిస్తుంది.. ఇంకా కొన్ని రైళ్లను తాతాల్కికంగా రద్దు చేసింది.. అయితే, తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో450 రైళ్లు రద్దు చేయగా.. తాజాగా మరో 31 ట్రైన్‌లు రద్దు చేసింది సౌత్ సెంట్రల్…
తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఖమ్మం, కోదాడ, సూర్యాపేట ,మహబూబాబాద్‌లో రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించినట్లు ఫైర్ డీజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, కోదాడలో చాలామందిని ఫైర్ సిబ్బంది రక్షించినట్లు తెలిపారు.
భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (TGDRF) ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 25 పెద్ద టవర్లు కూలిపోయినప్పటికీ విద్యుత్తు సిబ్బంది వెంటనే కరెంట్ సరఫరాను పునరుద్ధరించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
Trains Cancelled: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇప్పటి వరకు 450కి పైగా రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పాటు 140 రైళ్లు దారి మళ్లించగా.. మరో 13 రైళ్లను పాక్షికంగా క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించింది. రద్దైన వాటిలో సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు పలు పాసింజర్ రైళ్లు కూడా ఉన్నాయి. రైల్వే ట్రాక్‌లు పూర్తిగా వరద నీటికి కొట్టుకుపోవడంతో ట్రైన్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
Hyderabad-Vijayawada: విజయవాడ- హైదరాబాద్ మధ్య రాకపోకలకు హైవేపై మరోసారి అవరోధం ఏర్పాడింది. గరికపాడు దగ్గర పాలేరు బ్రిడ్జి దెబ్బ తిన్నది. ఇది ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆంధ్ర- తెలంగాణ సరిహద్దులోని పాలేరు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తూ రోడ్డును కోసివేయటంతో బ్రిడ్జిపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
19 Trains Canceled: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాల కారణంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే, తాజాగా గోదావరి ఎక్స్‌ప్రెస్ సహా 19 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం ప్రకటించారు.