భాగ్యనగరంపై మరో సారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. నగరంలో అర్థరాత్రి 12 గంటలు దాటాక పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని ఖైరతాబాద్, బంజారాహిల్స్, నాంపల్లి, పాతబస్తీ, కోఠి, అబిడ్స్, మలక్ పేట, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, హయత్‌నగర్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, ముషీరాబాద్, కాప్రా, హెచ్‌బీ కాలనీ, కుషాయిగూడ, రాయదుర్గం, ఖాజాగూడ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై వాన నీరు నిలవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. మళ్లీ వానలు…
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్న (శుక్రవారం) ఉదయం నుంచి రాత్రి వరకు భాగ్యనగరం సహా పలు జిల్లాల్లో భారీగా వానలు పడ్డాయి. నగరవాసులతంగా ఇంకా ఐదురోజుల పాటు అప్రమత్తంగా వుండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రేటర్ నగరంతో పాటు మహబూబ్ నగర్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రెడ్డ అలర్ట్ ఉంటుందని ప్రకటించింది. కాగా.. 4 రోజులు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న వెల్లడించారు.…
వారం రోజులుగా కురుస్తున్న వానలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో రహదాలు స్తంబించాయి. భారీ వర్షాల నేపథ్యంలో.. ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ముప్పును ఎదుర్కొంటోంది. కురుస్తున్న భారీ వర్షాలతో ఆలయం చుట్టూ వరద నీరు వచ్చి చేరుతోంది. ఈనేపథ్యంలో.. మురుగు కాల్వలోకి సాఫీగా నీరు వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో.. ఆలయ ప్రాంగణంలోనే వర్షపు నీరు నిలిచిపోతోంది. అయితే.. రామప్ప దేవాలయం.. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక…
తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరుణుడు కాస్త శాంతించాడు. గత కొద్దిరోజులుగా ఎడతెరపిలేకుండా, తన ప్రతాపాన్ని చూపి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాడు. అయితే నిన్న సాయంత్రం 6 గంటలనుంచి కాస్త శాంతించాడు. అయితే మళ్లీ 18 తర్వాత విజృంభించేందుకు అవకాశమున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న (గురువారం) ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా జయశంకర్ జిల్లా రేగులగూడెం, మంచిర్యాల చెన్నూరు లలో 6.2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. read also:…
నైరుతి రుతుపవనాల ఆగమనంతో హైదరాబాద్‌లో శుక్రవారం పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. మాదాపూర్, గచ్చిబౌలి, చింతల్, బాలానగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, అమీర్‌పేట్, పంజాగుట్టలో వాన పడుతున్నది. వీటితో పాటు హైదర్‌నగర్, ప్రగతినగర్, నిజాంపేట, బండ్లగూడ, సూరారం, బాచుపల్లితో పాటు తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అయితే.. పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో.. పలువురు వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా తెలంగాణాకు రావడంతో ఇప్పుడిప్పుడే…