నైరుతి రుతుపవనాల ఆగమనంతో హైదరాబాద్‌లో శుక్రవారం పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. మాదాపూర్, గచ్చిబౌలి, చింతల్, బాలానగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, అమీర్‌పేట్, పంజాగుట్టలో వాన పడుతున్నది. వీటితో పాటు హైదర్‌నగర్, ప్రగతినగర్, నిజాంపేట, బండ్లగూడ, సూరారం, బాచుపల్లితో పాటు తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అయితే.. పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో.. పలువురు వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా తెలంగాణాకు రావడంతో ఇప్పుడిప్పుడే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.