ఢిల్లీలో వరదలు రావడం వెనుక భారతీయ జనతా పార్టీ కుట్ర ఉందని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేస్తుంది. బీజేపీ పేరు ఎత్తకుండా హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి దేశ రాజధానికి అదనపు నీటిని విడుదల చేయడం వల్ల ఢిల్లీని ముంచేసే కుట్ర జరిగిందని ఆప్ సర్కార్ ఆరోపించింది.
TS Rains: తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తమిళనాడు తీరానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
Deadly lightning : వర్షం వచ్చినప్పుడు ఉరుములు, మెరుపులు చూసే ఉంటాం. అవి ఎలా వస్తున్నాయంటే రెండు మేఘాలు ఢీకొన్నప్పుడు శబ్ధం, కాంతి వస్తుందని చాలా మంది చెబుతుంటారు.
కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది.. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు.. నేడు శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఆయన.. ఏలూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయన్నారు.. మిగతా జిల్లాల్లో…
గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల ఉదయం.. మరికొన్ని చోట్ల సాయంత్రం ఆకాశానికి చిల్లుపడినట్లు వర్షం కురిసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాత్రం రాత్రి వేళ వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. నగరంలో కుండపోత వర్షం కురిసింది
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఇప్పటికే సిద్దమైంది. ఇక సీజన్ తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, సీఎస్కేల మధ్య జరుగనుంది. అయితే అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. దీంతో సీజన్ లో తొలి మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.
Rain in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. ద్రోణి బీహార్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు ఎత్తులో కొనసాగుతున్నది. మరోవైపు రాయలసీమ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల అవర్తనము సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో బలహీన పడింది.…