నగరానికి నైరుతి రుతుపవనాలు పలకరించాయి. నిన్నటి నుంచే నగరమంతా చల్లబడింది. అర్థరాత్రి తొలకరి జల్లులతో భాగ్యనగం తడిసింది. ఇన్ని రోజుల నుంచి ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలకు వాతావరణం చల్లబడటంతో .. ఊరిపి పీల్చుకున్నారు. రాగల మూడు రోజుల వరకు ఇదే వాతావరణం కనిపించనుంది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఈదురు గాలులతో భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ప్రస్తుతం కురుస్తున్న…
దేశ రాజధానిని వడగళ్ల వాన కుదిపేసింది. భారీ గాలి, వడగళ్లతో దేశ రాజధానిని అతలాకుతలం చేసింది. భారీ గాలులులతో చెట్లు కూలిపోయాయి. భారీ వర్షానికి నగర జీవనం ఒక్కసారిగా స్తంభించింది. గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. గాలి వాన భీభత్సానికి పలువురు మరణించారు. చాలా చోట్ల చెట్లు కూలిపోవడం వల్ల వాహనాలు దెబ్బతిన్నాయి. 2018 తర్వాత వచ్చిన చాలా ప్రభావంతో వచ్చిన వర్షంగా వాతావరణ శాఖ వెల్లడించింది. దాదాపుగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో…
రుతుపవనాలరాకకు ముందే కర్నాటకలో భారీవర్షాలు పడుతున్నాయి. బెంగళూరులో ఒక్కరోజులో 10 సెంటీమీటర్లకు పైగా వానపడడంతో ముంపులోనే అనేక ప్రాంతాలు వుండిపోయాయి. రెండవ రోజూ సీఎం సందర్శన కొనసాగుతోంది. బెంగళూరులో మంగళవారం ఈ శతాబ్దంలోనే కురిసిన భారీ వర్షంగా చరిత్రకెక్కింది. గత 113 ఏళ్లలో మే నెలలో ఒకేరోజు కురిసిన అత్యధిక వాన ఇదే. అంతేకాదు ఇది బెంగళూరు నగర చరిత్రలో రెండో అతిపెద్ద వర్షం. 1909 మే 6వ తేదీన 15.39 సెంటీమీటర్ల కుండపోత అతలాకుతలం చేసింది.…
వేసవి కాలం ప్రారంభం నుంచి భానుడి ప్రతాపానికి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఉదయం నుంచే సూర్యుడు విరుచుకుపడుతుండడంతో మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే తెలంగాణపై ఉపరితల ద్రోణి ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న వేకువ జామున తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసాయి. దీంతో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. కానీ.. రైతులకు ఆపార నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. కళ్లముందే నీటి పాలైంది. తెలంగాణలో…
హైదరాబాద్ వ్యాప్తంగా.. బుధవారం వేకువజామున భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామంతపూర్ లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో.. వరదనీటి కారణంగా రామ్ శంకర్ నగర్ లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పుడు కురిసిన చిన్నపాటి వర్షానికే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుటికైన నాయకులు, అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ పరిస్థితి గమనించి…
ఈ రోజు తెల్లవారుజామున ఒక్క సారిగా కురిసిన భారీ వర్షం, గాలుల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని సీజీమ్, సూపరింటిండెంట్ ఇంజినీర్లతో సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలపై కూలిన చెట్ల మూలాన విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని ఆయన అధికారులు వివరించారు. ఈ సందర్భంగా రఘుమా…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టించాడు. బుధవారం వేకువజామున్న ఒక్కసారిగా ఈదురు గాలులతో కుండపోత వర్షం కురియడంతో చెట్లు నేలకొరిగాయి. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం నీటి మునిగి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి క్షేత్రంలో కూడా భారీ వర్షం కారణంగా ఆలయ క్యూలైనల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. అంతేకాకుండా గుట్టపైకి వెళ్లేందుకు నిర్మించిన నూతన ఘాట్ రోడ్ భారీ వర్షానికి కోతకు గురైంది.…
వేసవికాలంల భానుడి ధాటికి చెమటలు కక్కుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది. బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురియడంతో పలు చోట్లు జలమయంగా మారాయి. అంతేకాకుండా ఈదురు గాలులతో కూడిన వర్షం కురియడంతో.. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. అయితే రంగంలోకి దిగిన జీఎచ్‌ఎంసీ సిబ్బంది.. చెట్లను తొలగించారు. దీంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో.. వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఉక్కపోతతో విసిగిపోయిన హైదరాబాద్ వాసులకు భారీ వర్షంతో కొంత ఊరట లభించింది. అయితే పలు…
తిరుమలలో కురిసిన భారీవర్షానికి భక్తులు తడిసిముద్దయ్యారు. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు గురి అయ్యారు.. సెలవు రోజు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్‌కు వెళ్లే భక్తులతో పాటుగా దర్శనం తర్వాత బయటకు వచ్చే భక్తులు తడిసిపోయారు. భారీవర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాఢ వీధులు, లడ్డూ వితరణ కేంద్రాల్లో స్వల్పంగా వర్షపు నీరు చేరుకుంది. వాన నీటిని బయటకు తోడే పనిలో…
బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ఏర్పడ్డ తెలంగాణలో వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యం సూర్యాపేటలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటజిల్లాలో అకాల వర్షాల పట్ల అధికారులను అప్రమత్తం చేశారు. ఈ…