Distribution of EVMs: కామారెడ్డి, జహీరాబాద్ లో భారీ వర్షానికి ఈవీఎం పంపిణీ కేంద్రం అస్తవ్యస్తంగా మారింది. అయితే కామారెడ్డిలో ఒక్కసారిగా వాతావరణం మారింది.
ఏపీకి వాతావరణ శాఖ భారీ వర్షాలు ఉన్నట్లు హెచ్చరించింది. రేపు (ఆదివారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే…
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షంతో పాటు పెద్ద ఎత్తున మంచు కూడా కురుస్తుంది. దీంతో చార్‌ధామ్ యాత్రకు తీవ్ర ఇక్కట్లు ఏర్పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇదిలా ఉంటే శుక్రవారం చార్‌ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ఇంతలో భారీ వర్షాలు స్థానికులను, భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడికి జనాలు అల్లాడుతున్నారు. బయటకు రావాలంటేనే ప్రజలు బయపడే పరిస్థితి నెలకొంది.కాగా.. పశ్చిమ బెంగాల్లో పరిస్థితి భిన్నంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మండే ఎండలతో వడగాలులకు వడదెబ్బ తాకి జన ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండల్లో జోరు వాన పడింది.
చైనాలోని దక్షిణ ప్రావిన్స్‌లోని గ్వాంగ్‌డాంగ్‌లో భారీ వర్షం కురిసి, ఆ ప్రాంతం చెరువులా మారింది. గత 65 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షాల కారణంగా 4గురు చనిపోగా, 10 మంది గల్లంతయ్యారు.
చాలా రోజులు తర్వాత కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా తాగు నీటితో ప్రజలు సతమతం అవుతున్నారు
ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మునుపెన్నడూ లేనంతగా కుండపోత వర్షం కురిసింంది. భారీ ఎదురుగాలులు, వడగండ్ల వర్షంతో దుబాయ్‌ను అతలాకుతలం చేసింది
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జల్‌పైగురి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా తుఫాన్ భారీ విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాన్ దాటికి నలుగురు చనిపోగా.. 100 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది.