పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జల్‌పైగురి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా తుఫాన్ భారీ విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాన్ దాటికి నలుగురు చనిపోగా.. 100 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది. ఈదురు గాలుల వల్ల మైనగురితో పాటు పరిసర ప్రాంతాల్లో అపార నష్టం వాటిల్లింది. ఈ తుఫాన్ ధాటికి పలు ఇళ్లు కూడా పడిపోయినట్లు సమాచారం. పలు చోట్ల చెట్లు నేలకొరగడంతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయాయి. రాజర్‌హత్, బర్నీష్, బకాలీ, జోర్పక్డి, మధబ్దంగా, సప్తిబరి ప్రాంతాల్లో ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.
Read Also: Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదులో పూజలు నిలిపివేయాలి.. నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ
ఇక, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తుఫాన్ వార్తలపై స్పందించారు. ఆదివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా భారీ వర్షం, ఈదురు గాలులు జల్‌పైగురి-మైనాగురిలోని కొన్ని ప్రాంతాలలో భారీ నష్టం చేసినట్లు తెలుసిందన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంతో పాటు అనేక మంది గాయపడ్డ వారి కుటుంబాలకు తన సానుభూతి తెలిపింది. జిల్లా, బ్లాక్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు, DMG, QRT బృందాలు విపత్తు నిర్వహణ కార్యకలాపాలలో పాల్గొని సహాయాన్ని అందిస్తున్నాయని సీఎం మమతా చెప్పారు. ఇక, బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు రెస్య్కూ టీమ్ అధికారులు తరలిస్తున్నారు. మరణిస్తే కుటుంబ సభ్యులకు, క్షతగాత్రులకు జిల్లా యంత్రాంగం నిబంధనల ప్రకారం పరిహారం అందజేస్తుంది.. నేను బాధిత కుటుంబాలకు అండగా ఉంటాను మమతా బెనర్జీ పేర్కొన్నారు.
Read Also: Rashmi Gautham: పెళ్లి చేసుకోబోతున్నయాంకర్ రష్మీ.. అబ్బాయి ఎవరంటే?
అయితే, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని విపత్తు నిర్వహణ అధికారి చెప్పుకొచ్చారు. గాయపడిన పలువురు ఆసుపత్రిలో చేరినట్లు ధూప్‌గురి ఎమ్మెల్యే నిర్మల్ చంద్ర రాయ్ తెలిపారు. ఈ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రజలను కలిసేందుకు సీఎం మమతా బెనర్జీ తక్షణమే జల్పాయిగురికి బయల్దేరి వెళ్లనున్నారు. బాధిత ప్రజలను కలిసిన ఆమె.. తుఫాన్ వల్ల సంభవించిన నష్టాన్ని కూడా పరిశీలించనున్నారు.
Sad to know that sudden heavy rainfall and stormy winds brought disasters today afternoon in some Jalpaiguri-Mainaguri areas, with loss of human lives, injuries, house damages, uprooting of trees and electricity poles etc.
District and block administration, police, DMG and QRT…
— Mamata Banerjee (@MamataOfficial) March 31, 2024