Hyderabad People: వర్షం వస్తే చాలు భయపడాల్సి వస్తుందని, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని మాదాపూర్ వాసులు, స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి ఫిర్యాదు చేసిన సరైన రీతిలో స్పందించడం లేదని మండిపడుతున్నారు. జీహెచ్ఎంసి, హెచ్ఎండీఏ అధికారుల మధ్య సమన్వయ లోపం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం రాకముందే మ్యాన్‌హోల్ , నాలాలు క్లీన్ చేసుకోవాలని తెలిపారు. కాని అలాంటి పరిస్థితి లేదని వాపోతున్నారు. గత రెండు రోజులుగా నరకయాతన అనుభవిస్తున్నామని తెలిపారు.
Read also: JC Prabhakar Reddy :మున్సిపల్ చైర్మన్ పదవికి మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!
వర్షం పడిందంటే చాలు గంటల తరబడి ట్రాఫిక్ లోనే చిక్కుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ళలోకి రావాలంటే రెండు, మూడు గంటలు పడుతుందని పేర్కొన్నారు. వర్షం వచ్చిందంటే చాలు రోడ్డుకు మూడడుగుల ఎత్తులో ఉన్న షాపుల్లోకి నీరు వచ్చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు.. మా సమస్యను తొందరగా పరిష్కరించాలని అధికారులకు కోరుతున్నామని అన్నారు. ఇప్పుడు వర్షాకాలం మొదలైందని ప్రభుత్వం దీనిపై స్పందించాలని తెలిపారు. ఇలానే ఏ అధికారులు పట్టించుకోకుండా ఉంటే షాపులు, ఇల్లు నీట మునిగే ప్రమాదం ఉందని తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
Read also: Gold Price Today: పసిడి ప్రియులకు భారీ షాక్.. తులం బంగారంపై రూ.770 పెరిగింది!
కాగా.. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సెరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో భారీ వర్షం కురిసింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించింది. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర నరకయాతన అనుభవించారు.
Gold Price Today: పసిడి ప్రియులకు భారీ షాక్.. తులం బంగారంపై రూ.770 పెరిగింది!