Telangana Rains: హైదరాబాద్ నగరమంతటా మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. నైరుతి గాలుల విస్తరణతో తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా.. అత్యవసర సమయాల్లో 040-21111111, 9001136675 నంబర్లకు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో 10, 11 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. నైరుతి రుతుపవనాల ప్రవేశంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Read also: CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. సోనియాగాంధీతో భేటీ
మరోవైపు నైరుతి రుతుపవనాలు తెలంగాణ, కోస్తాంధ్రలోని మరికొన్ని ప్రాంతాల్లోకి గురువారం ప్రవేశించిన విషయం తెలిసిందే. రానున్న మూడు, నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణతో పాటు మిగిలిన కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. బుధవారం దక్షిణ ఆంధ్రప్రదేశ్ చుట్టూ కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం గురువారం రాయలసీమలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉంటుంది. పెరుగుతూనే ఉందని చెప్పారు. వర్షాలు కురిసే సూచనలు ఉండడంతో రైతులు కూడా ఒకింత నిరాశకు లోనయ్యారు. దీంతో ఈసారి వర్షాలు బాగా కురిసి మంచి పంటలు పండాలని కోరుకుంటున్నారు. మరోవైపు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం తొమ్మిది మంది మరణించారు. దీంతో ఇప్పటికే ఆయా జిల్లాల్లోని అధికారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Ramoji Rao: ప్రాంతీయ ఛానెళ్ల రారాజు.. రామోజీరావు గురించి ఆసక్తికర విషయాలు..