రోహిణికార్తెలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో ఎండ తీవ్రతకు ఉక్కపోత తోడుకావడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదిలా ఉండగా.. పలు జిల్లాల్లో అక్కడక్కడ రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడనున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. ఓ వైపు వర్షాలు పడుతుండగా.. మరోవైపు ఎండలు దడ పుట్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తుండగా.. చాలా మండలాల్లో ఎండలు, వడగాల్పులకు జనాలు అల్లాడిపోతున్నారు. భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండగా.. ప్రజలు వేడిని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
Heat Wave Alert: ఎండలు మండిపోతున్నాయి.. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఇదే సమయంలో.. వడగాల్పులు విరుచుకుపడుతున్నాయి.. దీంతో, అత్యవసరం అయితేనే బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు.. నేడు ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లా కొమరాడ, వైఎస్ఆర్ జిల్లా చాపాడు, వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, ముద్దనూరు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మండల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని.. ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు…
ఏపీలో ప్రజలు రానున్న 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే 3 రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలకంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో ఉట్నూర్ మండలం పులిమడుగులో ఒక్కరు, కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్ లో ఇబ్రాహీం అనే పండ్ల వ్యాపారి వడదెబ్బతో మృతి చెందడం కలకలం రేపింది.
తెలంగాణలో వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఇటీవల కొన్నిరోజులు చల్లబడిన వాతావరణం భానుడి ప్రతాపం మళ్లీ సెగలు కక్కుతోంది. దీంతో బయటకు రావాలంటే ప్రజలు అవస్థలు పడుతున్నారు. వడగాల్పుల తీవ్రత కూడా ఉండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మంగళవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయుడుపేటలో అత్యధికంగా 44.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఖమ్మం జిల్లా మధిరలో 43.9 డిగ్రీల సెల్సియస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లెగోరిలో 43.8 డిగ్రీల సెల్సియస్, మహబూబాబాద్ జిల్లా గార్లలో…
ఓ వైపు తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించగా.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని.. అవసరం అయితేనే బయటకు రండి అంటూ ఐఎండీ హెచ్చరించింది. ఐఎండీ సూచలన ప్రకారం రాబోవు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ సమయంలో.. వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని.. డీహైడ్రేట్ కాకుండా…
అమెరికాలో వేడిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో ఎప్పుడు చల్లగా ఉండే అంటార్కిటికా సైతం వేగంగా వేడెక్కుతున్న ప్రాంతాల్లో ఒకటిగా మారిందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో 18.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. ఇక అంటార్కిటికాలో గత 50 ఏళ్లలో దాదాపు మూడు డిగ్రీల సెల్సియస్ మేరకు సగటు ఉష్ణోగ్రత పెరిగినట్లు డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్ పెటేరి తాలాస్ చెప్పారు. మంచు కొండలు ఎక్కువగా…