అమెరికాలో వేడిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో ఎప్పుడు చల్లగా ఉండే అంటార్కిటికా సైతం వేగంగా వేడెక్కుతున్న ప్రాంతాల్లో ఒకటిగా మారిందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో 18.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. ఇక అంటార్కిటికాలో గత 50 ఏళ్లలో దాదాపు మూడు డిగ్రీల సెల్సియస్ మేరకు సగటు ఉష్ణోగ్రత పెరిగినట్లు డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్ పెటేరి తాలాస్ చెప్పారు. మంచు కొండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధిక పీడనం కారణంగా ఫోహెన్ ప్రభావం ఏర్పడుతుంది. అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని రిపోర్టు వెల్లడించింది.
ఫోహెన్ ప్రభావం వల్ల.. మంచు కొండలకు ఒకవైపు నుంచి వీచే సాధారణ గాలులు.. కొండ అంచు నుంచి మరో వైపునకు వీచేటప్పుడు వేడెక్కుతున్నాయని దాని ఫలితమే అత్యధిక వేడి, ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఈ రిపోర్టు పేర్కొంది. ఈ గాలుల ఫలితంగా.. అంటార్కిటికాలోని ఎస్పెరంజా స్టేషన్, సేమౌర్ ద్వీపంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. గతంలో 2015, మార్చి 24న అంటార్కిటికాలో అత్యధికంగా 17.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడి ఎస్పెరంజా పరిశోధనా కేంద్రంలో ఈ ఉష్ణోగ్రత నమోదైనట్లు wmo- తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో రికార్డు స్థాయిలో నమోదైన 18.3 డిగ్రీల సెల్సియస్ కొత్త రికార్డు కూడా అర్జెంటీనాలోని అదే స్టేషన్‌లో నమోదైనట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు అంటార్కిటిక్ ట్రీటీ సిస్టంతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రొఫెసర్ తాలాస్ చెప్పారు.