ITBP Jawan: ములుగు జిల్లా వాజేడు మండలం శ్రీరామ్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కూలర్‌లో నీళ్లు నింపుతుండగా విద్యుత్ షాక్ తో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. భానుడి ప్రతాపం వల్ల ఎండలు మండుతుండగా.. చల్లదనం కోసం మనోజ్ అనే ఐటీబీపీ జవాన్ కూలర్‌లో నీళ్లు నింపుతుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Read Also: Medico Preethi Case: ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నాం: ప్రీతి తండ్రి
మృతుడు మనోజ్ అరుణచల్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో ఐటీబీపీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల సెలవుల కోసం ఇంటికి వచ్చాడు. రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా ఉండడంతో కూలర్‌ను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషాదం జరగడంతో కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోయాడని తల్లిదండ్రులు రోధించిన తీరు.. అక్కడి వారిని కంటతడి పెట్టించింది. ఐటీబీపీ జవాన్ మనోజ్ మరణంతో శ్రీరామ్‌నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.