రాష్ట్రంలోనే 45 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్న తొలి ప్రదేశంగా నంద్యాల అవతరించడంతో ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఎండలు ఠారెత్తించాయి. ఈ తీవ్రమైన వేడి రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది నివాసితులు ఇంటి లోపల ఆశ్రయం పొందవలసి వచ్చింది. తెలుగురాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. మరో 3 రోజులపాటు ఎండలు మండిపోతున్నాయని హెచ్చరించింది ఐఎండీ.. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడికి జనాలు ఒక్కరి బిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ నెల నుంచి కొన్ని జిల్లాల్లో 40 నుంచి…
తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి. భానుడి భగభగలకు జనాలు విలవిలలాడిపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. దీంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు
ఏపీ ప్రజల్ని వాతావరణశాఖ అలర్ట్ చేసింది.. రాష్ట్రంలో వడగాల్పులు కొనసాగుతున్నాయి. రానున్న రెండ్రోజుల పాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఏపీ వాతావరణశాఖ హెచ్చరించింది. సోమవారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 139 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం 33 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 113 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
భానుడి భగభగలతో అల్లాడి పోతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురవడంతో నేల తల్లి తడిసింది. దీంతో ఇన్ని రోజులు తీవ్ర ఎండలతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షం కాస్త ఊరట కలిగించింది.
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం నుంచే సూర్యుడు భగభగ మండిపోతున్నాడు.
తెలంగాణలో భానుడు భగభగ మండిపోతున్నాడు. భానుడి సెగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలు దాటిపోయాయి. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.