Telangana Assembly Budget Sessions: నేటి నుండే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.!
- తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం
- ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ శివప్రతాప్ శుక్ల ప్రసంగం
- ఉదయం 11:45 గంటలకు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly Budget Sessions: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు (మార్చి 16) ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ శివప్రతాప్ శుక్ల ప్రసంగిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు స్పీకర్ చాంబర్ లో బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతుంది ప్రభుత్వం. ఉదయం 11గ:45 నిమిషాలకు ఉభయ సభల సంయుక్త సమావేశం ప్రారంభం కానుంది.
Cuttack Hospital Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది రోగులు మృతి.!
Also Read
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన శివప్రతాప్ శుక్ల మొదటిసారి అసెంబ్లీకి రానున్నారు. ఉదయం 11: 25 నిమిషాలకు గవర్నర్ అసెంబ్లీకి చేరుకుంటారు. 11:45 నిమిషాలకు గవర్నర్ ప్రసంగం ప్రారంభంవుతుంది. 10 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగానే సభా ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే ఈ విగ్రహ రూపాన్ని బిఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది.
అసెంబ్లీలో కీలక అంశాలను చర్చించడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇందులో గిగ్ వర్కర్ల కోసం కొత్త చట్టం తీసుకురాబోతుంది ప్రభుత్వం. గిగ్ వర్కర్ల హక్కుల పరిరక్షణ కోసం కొత్త చట్టానికి మద్దతుపై చర్చించనున్నారు. ఇంకా విద్యారంగంలో కొత్త విధానాల అమలు మార్పులు బడ్జెట్ కేటాయింపులపై చర్చ జరగనుంది. సోషల్ మీడియా కట్టడి పైన చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే నగరంలోని మూసి నది ప్రక్షాళన నదీ జలాల అంశం, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది.
Ustaad Bhagat Singh: ఈ ఉగాది.. ‘ఉస్తాద్’ ఉగాది.. పవర్ స్టార్ ఒక రియల్ ఇన్‌స్పిరేషన్: శ్రీలీల
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటరెడ్డి వెంకట్ రెడ్డి, చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు, డిజీపి శివధర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనుకోని సంఘటనలు, అవాంచనీయ పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు స్పీకర్ ప్రసాద్ కుమార్. అసెంబ్లీ కౌన్సిల్ ఇప్పుడు ఒకే ప్రాంగణంలో పనిచేయబోతున్నాయి. దీంతో సెక్యూరిటీ పార్కింగ్ లాంటి విషయాల్లో ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు స్పీకర్ చాంబర్ లో బిఏసి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పని దినాలు ఎజెండా పై చర్చించనున్నారు.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!