Heart Attack Video: డాక్టర్ పరీక్షిస్తుండగానే గుండెపోటుతో రోగి మృతి..
- ఇండోర్‌లో వైద్యుడి వద్దకు చికిత్స కోసం వచ్చిన ఓ రోగి గుండెపోటుతో మృతి.
- సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heart Attack Video: ఇండోర్‌లో వైద్యుడి వద్దకు చికిత్స కోసం వచ్చిన ఓ రోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఆస్పత్రిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో మృతికి సంబంధించిన వీడియో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని గ్రహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిందని., పరదేశిపుర పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ పంకజ్ ద్వివేది తెలిపారు. ఓ యువకుడు ఛాతీ నొప్పితో ఆస్పత్రికి వచ్చినట్లు ఈ వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది. అయితే., చికిత్సకు ముందే అతడు మరణించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కుటుంబీకులు అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా యువకుడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
Rats Poison Spray: హాస్టల్‌లో ఎలుకల మందు స్ప్రే చేయడంతో స్పృహ కోల్పోయిన 19 మంది విద్యార్థులు..
Also Read
చనిపోయిన 31 ఏళ్ల యువకుడి పేరు సోను మట్కర్. సోను ఇండోర్ నివాసి. అతడు ఆటో నడుపుతూ ఉండేవాడు. రాత్రి సోనుకు అకస్మాత్తుగా ఛాతీలో అసౌకర్యం కలిగింది. ఆ సమయంలో అతను స్వయంగా పరదేశిపుర ప్రాంతంలోని ప్రభుత్వ దయానంద్ ఆసుపత్రికి ఆటోను నడిపాడు. అక్కడ అతను చికిత్స పొందేలోపే మరణించాడు. ప్రస్తుతం ఈ కేసు సంబంధించి ట్రయల్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు. యువకుడికి గుండెపోటు వచ్చినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. అయితే., పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలియనున్నాయి.
इंदौर में डॉक्टर के सामने युवक को हार्ट अटैक से LIVE मौत pic.twitter.com/07u6TeK1pa
— Vrajander Singh (@vrajandersingh_) August 19, 2024
తాజావార్తలు
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!