Health: ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడమే కాదు.. తీసుకునే ఆహారాన్ని సరైన పద్దతిలో తీసుకోవాలి.. లేకపోతే ఆ ఆహారం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం పక్కన పెడితే అనారోగ్యం భారిన పడడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పప్పు ని వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పూర్తి పోషకాలను శరీరానికి అందించవచ్చు. మనం నిత్య జీవితంలో చాల రకాల పప్పులను ఉపయోగిస్తుంటాము. వారంలో కనీసం రెండు రోజులైనా…
Health Tips: వాతావరణం మారిన వెంటనే పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురికావడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా రుతుపవనాలు వచ్చినప్పుడు లేదా వేసవి నుండి చలికాలం వరకు మారే సమయంలో పిల్లలకు రోగాలు వస్తుంటాయి.
Milk: పాలు పౌష్టికాహారం అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు మొదలైన అన్ని పోషకాలు ఉంటాయి. ఆవు, గేదె పాలు రెండూ చాలా పోషకమైనవి..
డ్రాగన్ ఫ్రూట్.. ఇది చూడటానికి అందంగా కనిపిస్తుంది. తింటే కూడా ఆరోగ్యంగా ఉంటారు. డ్రాగన్ ఫ్రూట్ కొందరికి తెలియకపోయినప్పటికీ.. ఇది తిన్నారంటే శరీరానికి కావాల్సిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం మనదేశంలోనూ కూడా ఎక్కువగా పండిస్తున్నారు. ఈ పండ్లకు మార్కెట్ లో ధర ఎక్కువగానే ఉంటుంది. ఈ ఫ్రూట్ ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. ఇది తినడం వల్ల శరీరంలో ఉండే కొన్ని వ్యాధులను నయం చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
health: ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు.. ఎందుకంటే ఏది కోల్పోయిన సంపాదించుకోగలం కానీ ఆరోగ్యాన్ని కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. అందుకే ఆరోగ్యానికి చాల ప్రాధాన్యత ఇచ్చారు మన పూర్వికులు. వాళ్ళ ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విదాంగా ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. తినే ఆహారం మారింది. అయితే ఆరోగ్యం బావుండాలి అంటే కొన్ని కూరగాల్ని తినక తప్పదు. అయితే ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందించే నేతి బీరకాయ గురించి…
Acidity Problem Solution : మన కడుపు తగినంత మొత్తంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేయలేనప్పుడు అసిడిటీ ప్రధానంగా సంభవిస్తుంది. యాసిడ్ పని ఆహారాన్ని జీర్ణం చేయడం. తక్కువ యాసిడ్ ఉత్పత్తి అయినట్లయితే.. కడుపులో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు అప్పుడు ఆమ్లత్వం పెరుగుతుంది.
డెంగ్యూ జ్వరం అంటే ఎంతో ప్రమాదకరమైనదో చెప్పనక్కర్లేదు. సీజన్ మారుతుందంటే ఇది తొందరగా విజృంభిస్తుంది. డెంగ్యూతో చాలా మంది ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. డెంగ్యూకు ఇంతవరకు నిర్ధిష్టమైన మందులు, చికిత్స విధానాలు లేవు. తాజాగా.. డెంగ్యూ వ్యాధికి తొలి ఔషధాన్ని 'జాన్సన్ అండ్ జాన్సన్' కంపెనీ రూపొందించింది. దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా.. ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు.
మగవారి కోసం కొత్త రకం గర్భనిరోధక ఇంజెక్షన్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఇంజెక్షన్ సహాయంతో 99 శాతం గర్భాన్ని నివారించవచ్చని చెబుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఏడేళ్ల ఇంటెన్సివ్ రీసెర్చ్ తర్వాత ఈ ఇంజెక్షన్‌ను ఆమోదించారు. ఈ ఇంజెక్షన్ తీసుకోవడం చాలా సులభమని.. దీని సక్సెస్ రేట్ చాలా ప్రభావవంతంగా ఉంటుందని తెలిపింది.
గ్రీన్ టీ తెలుసు, బ్లాక్ తెలుసు.. కానీ వైట్ టీ ఉంటుందన్న విషయం కొందరికి తెలియదు. సాధారణంగా చాలా మంది టీ తాగడం అలవాటే. కానీ వైట్ టీని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చాలా మందికి తెలిసుండదు. వైట్ టీ తాగడం వలన ముఖ్యంగా బరువు తగ్గే అవకాశం ఉంది.. అంతేకాకుండా ముఖంపై కనపడే వృద్దాప్యాన్ని కనపడకుండా దోహదపడుతుంది. ఇదిలా ఉంటే.. వైట్ టీ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీమైక్రోబయల్ గుణాలు..…
ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం చాలా మంచిది. వాకింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల రిస్కు తగ్గుతుంది. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్, ఆస్తమా, కొన్ని రకాల కేన్సర్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ప్రతీ రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. కండరాలకు బలం చేకూరుతుంది. బరువు తగ్గడానికి చాలా సులువైన మార్గం నడవడం. అయితే మీరు వాకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు…